Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పులు

GUN

అమెరికా : టెక్సాస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి చనిపోయాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో క్యాంపస్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి అక్కడికక్కడే చనిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు పారిపోయాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో యూనివర్సిటీని మూసివేశారు.

 Police shot dead in Texas University

Comments

comments