Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

సోషల్‌మీడియా ఓ అద్భుత వేదిక!

                  Computer

ఇప్పుడంతా డిజిటల్ జమానా. మన నిర్ణయాలపై కూడా సోషల్‌మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ బ్రాండ్ల ప్రచారానికి సోషల్‌మీడియానే ఆశ్రయిస్తున్నారు. కస్టమర్ల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని, విశ్లేషణ చేసుకుని తమ ప్రచారాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రాండ్‌ను నిర్మించేందుకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామే సరైనది. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను తక్కువ బడ్జెట్‌లో చేరుకోవచ్చు.

నేటి ప్రపంచంలో సోషల్ మీడియా అనేది శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఘనత సోషల్ మీడియాది. అందుకే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సేవలందించేవారికి ఇదొక అద్భుతమైన వేదిక. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు ఓ వరం. వారికిదో చక్కటి అవకాశం. టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉత్పత్తులకు పబ్లిసిటీ తీసుకురావడం చాలా కష్టం. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా కోట్లాదిమందితో కనెక్ట్ అవుతున్నారు.పైసా ఖర్చు లేకుండా ప్రొడెక్ట్‌కు మంచి పబ్లిసిటీ వస్తుంది. న్యూస్ అయినా, ఈవెంటైనా వైరల్‌గా కోట్లాదిమందికి చేరుతోంది. ఈ అవకాశాన్ని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.

తమ సర్వీసెస్‌ను డిజిటల్ మార్కెటింగ్‌లో పెట్టి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. చేసే వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా సరే సోషల్‌మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు చీరలు, డిజైనర్ బ్లౌజులు, పచ్చళ్లు, యాక్ససరీస్‌లాంటి చిన్న వ్యాపారాలను చక్కగా అభివృద్ధి చేసుకుంటున్నారు. పైసా ఖర్చులేకుండా పబ్లిసిటీ తెచ్చుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వేలకు వేలు ఖర్చుపెట్టే కన్నా సోషల్ మీడియాను ఆశ్రయించడమే మేలనుకుంటున్నారు.

కొత్తవారిని పరిచయం చేసుకుని తమ సేవలను అందిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో విజేతలవుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లలో సోషల్ మీడియాను వాడే వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు. సాధారణంగా మహిళలకు పురుషుల కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారా మహిళలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. గ్రూప్‌లలో యాక్టివ్‌గా ఉంటున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు సోషల్ మీడియా పర్ఫెక్ట్ చాయిస్.

డిజిటల్ మార్కెటింగ్‌లో అనేక సవాళ్లుంటాయి. సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. లేకుంటే కనెక్టవిటీ పోతుంది. పబ్లిసిటీ కోసం సమయం వెచ్చించాలి. సోషల్‌మీడియాలో కావాల్సిన పనికోసం ఓపిగ్గా ఎదురుచూడాల్సి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించడానికి ఓ టీంను మెయిన్‌టెయిన్ చేయాలి. అప్పుడే డిజిటల్ మార్కెటింగ్‌లోని సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. సోషల్ మీడియాపై కొన్ని అపోహలుంటాయి. సమయం వృథా అవుతుందనుకుంటారు. అది తప్పు. ఇన్‌వెస్ట్‌మెంట్ పెట్టడానికి వెనుకడుగు వేయకూడదు. ఇందులో పెట్టుబడి పెడితే కావాల్సినంత పబ్లిసిటీ రావడం మాత్రం ఖాయం. ప్రైవసీ విషయంలోనూ అనేక అపోహలు ఉన్నాయి. పబ్లిసిటీ విషయంలో మాత్రం సోషల్ మీడియానే సరైనది.

Comments

comments