Search
Wednesday 21 February 2018
  • :
  • :

జిఎస్‌టి పరిధిలోకి రియల్ ఎస్టేట్

ARUN-JAITLEY

వాషింగ్టన్ : జిఎస్‌టి పరిధిలోకి రియల్ ఎస్టేట్‌ను తెచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పన్ను ఎగవేతకు ఎక్కువ అవకాశం ఉన్న రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గువహటి వేదికగా నవంబరు 9న జరిగే జిఎస్‌టి మండలి సమావేశంలో దీనిపై చర్చిస్తామని ఆయన చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న జైట్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో భారీగా పన్ను ఎగవేయడంతో పాటు నగదు సృష్టికి అవకాశం ఉన్న రియల్ ఎస్టేట్ ప్రస్తుతం జిఎస్‌టి పరిధిలో లేదన్నారు. రియల్ ఎస్టేట్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకరావాలని కొన్ని రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయని, ఈ రంగాన్ని జిఎస్‌టి పరిధిలోకి తీసుకరావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాను బలంగా నమ్ముతున్నట్టు ఆయన చెప్పారు.

Real Estate under GST

Comments

comments