Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నేనేమి చేశాను నేరం!!

baby-and-moms

ఓ తల్లి జన్మనిచ్చింది.. మరో తల్లి ప్రేమను పరిచయం చేసింది…ఇద్దరూ తల్లులే ఆ పసి హృదయానికి! ఒకరిది పేగు బంధం… మరొకరిది పెంచిన మమకారం…ఇద్దరికీ ప్రాణమే ఆ చిట్టి తల్లంటే!! ఓ కఠిక తండ్రి నిర్ణయం.. ఇప్పుడు ఇద్దరు తల్లులు.. ఓ పసిపాపనరక వేదనకు కారణమవుతోంది. మూడేళ్ల ప్రాయంలో ఎటూ తేల్చుకోలేక పసిహృదయంవిలవిల్లాడుతోంది. తొమ్మిది మాసాలు మోసిన ప్రేమతో ఒకరు … మూడేళ్లు పెంచిన బంధంతో మరొకరు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. చట్టం వైపు కొందరు.. మానవత్వం వైపుమరికొందరు నిలవగా, న్యాయం కోసం తల్లులు, మమకారం కోసం పసిప్రాయం తల్లడిల్లుతోంది.

ఖమ్మం ప్రతినిధి: రెండోసారి ఆడపిల్లే పుట్టింది. ఎలాగైనా వదిలించుకోవాలన్న తండ్రి దురాలోచనకు మరో ఇద్దరుతోడు కావడం.. ఇప్పుడు ముగ్గురి రోదనకు కారణమైంది. మూడేళ్ల తర్వాత వెలుగు చూసిన సంఘటన చట్టం, మానవతా దృక్పథం ఈరెండింటికీ పరీక్షగా నిలిచింది. చట్టం ఏం చెప్పినా మానవతా ధృక్పథంతో ఆలోచించాలని స్థానిక ప్రజలు మహిళా సంఘాలుకోరుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇల్లందులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురంగ్రామానికి చెందిన మాలోత్ బావ్‌సింగ్, ఉమా దంపతులకు రెండవ కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో తల్లికి తెలియకుండా పిల్లను వదిలించుకోవాలనుకున్నాడు.

ప్రసవం చేసిన ఆసుపత్రి వైద్యుడు ఓ ఆర్‌ఎంపి సాయంతో సరిగ్గా కళ్లు అయినా తెరవని పసిగుడ్డును ఇల్లందు స్ట్రట్ పిట్ బస్తీకి చెందిన వేముల రాజేంద్రప్రసాద్, స్వరూప దంపతులకు రూ.25వేలకు విక్రయించాడు. అప్పట్లో ఇల్లందులో నివసించిన బావ్‌సింగ్ దంపతులు ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లారు. వారం కిందట ఉమా ఇల్లందులోని బంధువుల ఇంటికి వచ్చిన సందర్బంలో తన బిడ్డను విక్రయించారన్న విషయం తెలిసింది. అప్పట్లో చనిపోయిందని భర్త చెబితే నమ్మిన ఉమా బిడ్డ చనిపోలేదు బతికే ఉందని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. పిల్లలు లేని రాజేంద్రప్రసాద్, స్వరూప దంపతులు ఒక్కరోజు

పసిగుడ్డును అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు మూడేళ్ల వయస్సున ఆపాపకు సన్విత అని పేరు పెట్టారు. ఉమా ఫిర్యాదుతో పోలీసులు సన్వితను పెంచిన తల్లిదండ్రులను స్టేషన్‌కుపిలిపించి విచారణ చేపట్టారు. డిఎన్‌ఏ పరీక్షల అనంతరం నిర్ణయం తీసుకుంటామంటూ ఐసిడిఎస్ సంరక్షణకుసన్వితను తరలించారు. ఈ ఘటనను పెంచిన తల్లి స్వరూప జీర్ణించుకోలేకపోతుంది. వేదనతో తల్లడిల్లుతుంది.సన్విత సైతం పెంచిన తల్లే కావాలంటూ రోధిస్తుంది. పెంపుడు తల్లికి మద్దతుగా బుధవారం ఇల్లందులోరాజకీయాలకు అతీతంగా మహిళా సంఘాలకు స్థానిక ప్రజలు ఆందోళన చేశారు. అవసరమైతే మైనార్టీ తీరినతర్వాత ఆ పాప నిర్ణయానికి వదిలి వేయాలని కానీ ఇప్పుడు మాత్రం పెంచిన తల్లికే సన్వితను అప్పగించాలనిడిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా అసలే గుండె జబ్బుతో ఉన్న స్వరూప సన్విత దూరం కావడంతో తీవ్రఅనారోగ్యానికి గురైంది. ఆమె స్థితిని చూసిన వారు కన్నీంటి పర్వంతమవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిచట్టం తన పని తాను చేసి ఓ తల్లికి ఆవేదనను మిగుల్చుతుందా లేక మానవతా ధృక్పథాన్ని చాటుతుందో వేచిచూడాలి. ఏదీ ఏమైనా ఇప్పుడు చిన్నారి సన్విత పెంచిన తల్లి కోసం పడుతున్న వేదన చూసి ప్రతి ఒక్కరు కన్నీంటిపర్వంతమవుతున్నారు.

Comments

comments