Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు

CS-SP-Singh

సిఎస్ ఎస్‌పి సింగ్ ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖలలో ప్రత్యక్ష నియామకాల కింద ఖాళీగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.సింగ్ ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ , శాసన మండలి, శాసన సభ సమావేశాలపై వివిధ శాఖల ఉన్నత అధికారులతో ఆయన సమీక్షించారు. సిఎం కెసిఆర్ ఎస్‌సి, ఎస్‌టి పోస్టులపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, తమతమ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళకను రూపొందించాలన్నారు. జూన్ 2, 2014 తరువాత భర్తీ చేసిన ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్ లాగ్ పోస్టుల వివరాలు తయారు చేయాలన్నారు. జూన్ 30, 2018 నాటి వరకు ప్రభుత్వం ఖాళీల భర్తీకి గడువు పొడిగించిందని, తమ తమ శాఖల ఖాళీలను టిఎస్‌పిఎస్‌సి కి అందచేయాలన్నారు.

178 విభాగాలకు గాను 69 విభాగాల నుండి సమాచారం పంపారని, మిగత శాఖలు వెంటనే వివరాలు పంపాలని ఎస్‌పి.సింగ్ అన్నారు. ఈ నెల 27 నుండి ప్రారంభమయ్యే శాసన మండలి, శాసన సభ సమావేశాల సం దర్భంగా గౌరవ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెం టనే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించా రు. సమావేశాలను పురస్కరించుకొని శాఖలకు సంబంధించి ప్రత్యేక నోట్ లను తయారు చేయాలన్నారు. ఈ సమావేశాలలో అడిగే ప్రశ్నలకు సంబంధించి ముందుగానే సమాచారం తయా రు చేయాలన్నారు. గత సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. ప్రతి ప్రశ్నకు అవసరమైన సప్లిమెంటరీ నోట్ ను తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

comments