Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

కెసిఆర్‌ది దొరలను మించిన అణచివేత

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

                      chada-Venkat-reddy

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ తాను దొ రను కానని, గడీలు లేవని అంటున్నారని, గడీల దొర లను మించి ప్రజలను అణచివేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కెసిఆర్‌ది యూస్ అండ్ త్రో పాలసీ అని, తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన ప్రజలను విస్మరించారని, తెలంగాణ జె ఎసి చైర్మన్ కోదండరావ్‌ును దిగజారి విమర్శిస్తున్నారని విమర్శించారు. సిపిఐ పోరుబాట ఆరో రోజు బుధవారం నాడు యాప్రాల్, అల్వాల్, శామీర్‌పేట, మేడ్చల్ మీదు గా సాగింది. ఈ సందర్భంగా పలు చోట్ల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేబినెట్‌లో ఎనిమిది మంది తెలం గాణ ద్రోహులకు పట్టం గట్టారని మండిపడ్డారు.

పండు గలకు బట్టలిస్తూ, చీరలిస్తూ ఎన్నికల హామీలను మరి పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారని, కాని కెసి ఆర్ కుటుంబానికే నౌకరీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎన్నికల్లో సిఎం, ఆయన కుమా రుడు కెటిఆర్ రెండు లక్షల డబుల్ బెడ్‌రూవ్‌ు ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పి ఊదరగొట్టారని, ఎన్నికల్లో గెలిచి రెండే ళ్లు కావొస్తున్నా హైదరాబాద్‌లో ఒక్క డబుల్ బెడ్‌రూవ్‌ు ఇళ్ళైనా ఇచ్చారా అని నిలదీశారు. డబుల్ బెడ్ రూవ్‌ు ఇ ళ్లు కట్టకపోతే కెసిఆర్‌ను వదిలిపెట్టబోమని, ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ అవినీతికి కే రాఫ్ అడ్రస్‌గా మారిందని ధ్వజమెత్తారు, అవినీతికి పా ల్పడిన టిఆర్‌ఎస్ సర్పంచులను కలెక్టర్‌లు సస్పెండ్ చే స్తుంటే, పైన కెసిఆర్ ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తోం దన్నారు.

ఎంఎల్‌ఏలు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ కలెక్టర్‌లపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని మండిసడాకడరు. మరోవైపు తమ పాలనలో రాజకీయ అవినీతి లేదని సి ఎం కెసిఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. హద్దుల ను గుర్తింకుండా చేస్తున్న భూ సర్వేతో ప్రయోజనం ఉం డబోదని పేర్కొన్నారు. అందరూ కలిసి సాధించిన తెలం గాణలో కేవలం తన సొంత ఆలోచనలే తప్ప ఎవ్వరి సూ చనలు పట్టించుకోకుండా కెసిఆర్ నియంతృత్వ పోకడ లకు పోతున్నారని విమర్శించారు. సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి గూడ అయిలయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ నాయకులు ఎన్.బాలమల్లేశ్, పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, ఎం.డి.యూసుఫ్, దశరధ, సాయిలు గౌడ్, యేసురత్నం, ఉమా మహేశ్ ఎఐటియుసి నాయ కులు నర్సింహన్, రత్నాకర్‌రావు, టిడిపి నేత ఎస్.వి. కృష్ణారెడ్డి, జెఎసి నాయకులు పాల్గొన్నారు.

Comments

comments