Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఏడుద్దాం పదండి!

Cartoons

పిల్లలను కాపాడుకోలేని సమాజాన్ని ‘ అబద్ధాల కోట కట్టినట్టు’ గా మనం సాధించుకొన్నాం . ఎన్ని సమస్యలనైనా ఓర్చుకొంటూ పిల్లల్ని కాపాడుకొంటూ చదివించుకొనే తల్లి దండ్రులున్న దేశంలో వారి సహనానికి పరీక్ష పెట్టే సన్యాసులు ( ఐమీన్ ఇట్) రాజ్యమేలుతున్నారు. ‘ప్రభుత్వ డబ్భు మనం తినడానికే ఉంది’ అనుకొంటున్న రాజకీయ అధమ్మ పెభువులు పిల్లల సంక్షేమాన్ని గాలి కొదిలేసారు. ఆడబ్బు ఆనక మనం తినాలి కదా’ అనుకొని పిల్లల విషయంలో పొదుపు పాటిస్తున్నారు నేతలు. ‘పాలన కాదు.. అజెండా ముఖ్యం’ అనిచెప్పే సిద్ధాంత రాక్షసుల డైరెక్షన్‌లో డబ్బు ప్రచారాలతో అందలాలు ఎక్కిన వాళ్లు ‘అదే మంచి చౌక బేరము’ అని పాడుకొంటున్నారు. పిల్లలకి పాడె కడుతున్నారు.

కాదన్న మాదన్నలు గోరఖ్ పూర్ వైపు దృష్టి సారించండి. ఆక్సిజన్ లేకో, విషం ఉండో .. అక్కడ పిల్లలని ఆసుపత్రులు చంపేస్తున్నాయి. గోచీ కట్టు పాలకాగ్రేసరులు ముప్పొద్దులా తింటూ ధర్మ రక్షణ ఉపన్యాసాలు దంచుతున్నారు. వీళ్లకి ఎలాగూ సిగ్గులేదు సరిగదా ‘వాళ్లు ధర్మాన్ని నిజంగా రక్షిస్తారు’ అని లకాయి లుకాయి గాళ్లు నిజంగా నమ్మేస్తూ ప్రింట్ మరియూ సామాజిక మీడియాలో ఇంకు కార్చుకొంటున్నారు.

ఏదో తొలిరోజు 70 మంది పిల్లలు పోతే కన్నీళ్లు కార్చిన మీడియా ఆతరవాత ఆవార్తలకి నీరు కార్పిస్తోంది. రాజకీయ అపభ్రంశ ఎత్తుగలడల మర్మం విప్పే పనిలో పాపం వాటికి వాస్తవాలు ఆనడం లేదు. వాటికి అవి కనిపిస్తే గదా చూపించడానికి. అవున్నిజమే.వాటిని ప్రింటుకో, గాలికో ఒదిలేయాల్సిందే. ఆధార్ లేదని రేషన్ ఇవ్వని దరిద్రుడొకరు, పిల్లలు చస్తుంటే బోరవిరుచు తిరిగే దగుల్బాజీ ఒకడు .. ఇలా పాలక.. పిలకలు మనకున్నాయి(రు).

ఎన్నికలు తరుము కొస్తున్నా బుద్ధి రాని సరికొత్త ఎకిమీడలు మనకి దాపురించారు. పూర్వం ఎన్నికలు తలుచుకు భయ పడేవారు. ఏవో హామీలు( తరువాత గాలిలో కలిసిపోయినా) బోర్లించేవారు. ఇప్పుడు అలా భయపడడం మానేశారు.‘డెమన్’లని తట్టిలేపి అన్ని ఎన్నికలకీ టోకున సొమ్ము చేసుకొన్నాక ఇంక భయం ఏమిటికి? శవాలకి పగలబడి నవ్వుతూ ఎదురెళ్లగల ధైర్యం ఇక వారి సొంతం అయ్యాక ‘ఎన్నికలా మాకడ్డంకి’ అని విర్రవీగుతున్నారు. అవును పసివాళ్ల చావులు కూడా వారికి అడ్డంకి కాదు. వారి ఎన్నికల దారికి అడ్డం తొలగి, ఆ శవాల దగ్గర ఏడుద్దాం పదండి.

Comments

comments