Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

మైనర్ భార్యతో సెక్స్ నేరం

15-18 ఏళ్ళ వయస్సులోనే భార్యతో శృంగారాన్ని అనుమతిస్తున్న ఐపిసి 375లోని క్లాజ్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
బాల్య వివాహాలను అరికట్టలేకపోవడంపై, సామాజిక న్యాయ చట్టాల స్ఫూర్తిని నిర్లక్షం చేయడంపై ఆందోళన

Supremeన్యూఢిల్లీ: మైనర్ భార్యతో లైంగిక చర్య నేరమేనంటూ సుప్రీంకోర్టు బుధవారం సంచలనాత్మక తీర్పు చెప్పింది.  15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న భార్యలను  అత్యాచార చట్టం నుంచి మినహాయించడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసిం ది. అత్యాచార నేరాన్ని నిర్వచిస్తున్న భారతీయ శిక్షా స్మృతి 375 (ఐపిసి) 15 ఏళ్లు దాటిన భార్యతో శృంగారాన్ని అనుమతిస్తుంది.  దీనిని సుప్రీంకోర్టు రద్దుచేసింది. మైనారిటీ తీరని భార్య తో శృంగారాన్ని  అత్యాచార నేర నిర్వచనం నుంచి మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్లు స్పష్టం చేసింది. మైనర్ భార్యతో సెక్స్ అత్యాచారంతో సమానమని, దానిని నేరంగానే పరిగణించాలని చెప్పింది.  బాల్య వివాహాలపై న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, దీపక్ గుప్తలతో కూడిన ధర్మాసనం ఆం దోళన వ్యక్తం చేసింది. పార్లమెంటు ఆమోదించిన సామాజిక చట్టాలను చిత్త శుద్ధితో అమలుచేయడంలేదని పేర్కొంది. సంబంధిత పక్షాలు వైవాహిక అత్యాచారం అంశాన్ని ఇదివరలో లేవనెత్తనందు వల్లే దానిని విచారించలేదని ధర్మాసనం స్పష్టం చేసిం ది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిషేధించే చర్యలను చేపట్టాలని కోర్టు ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. అక్షయ తిథియ రోజున మైనర్  బాలికలకు పెద్ద ఎత్తున వివాహం చేయడంపై  కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా మైనర్ బాలికల వివాహాలు కొనసాగడం సరికాదని కూడా కోర్టు తెలిపింది.

Comments

comments