Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

BUS-ACCIDENT

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా పరిధిలోని మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న అవనిగడ్డ డిపో బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో బస్సు డ్రైవర్, రాణి, మాతంగి వరప్రసాద్‌లను గుర్తించారు. మిగిలిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కృష్ణా జిల్లా కోసూరుకు చెందిన మునగాల రమాదేవి, పెద్దకూడి సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Six killed in road accident

Comments

comments