Search
Tuesday 19 June 2018
  • :
  • :

భలే భలే సీతాఫలం

                          Fruit

మన తెలంగాణ/సిటీబ్యూరో: పోషక విలువలు సమృద్ధిగా ఉండి, చలువ చేసే పండుగా సీతాఫలానికి పేరుంది. నగర మార్కెట్లలో ప్రస్తుతం సీతా ఫలాలు అధిక సంఖ్యలో దర్శనం ఇస్తూ ప్రజల జివ్వాలకు రుచులను అందిస్తున్నాయి. పొలం గట్లు, ఖాళీ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు ఇలా ఎక్కడైన సులభంగా పెరిగే సీతాఫలం చెట్లు, వేరు నుంచి గింజ వరకు ఔషధ గుణాలు కలిగిఉన్నాయి. అతి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ప్రియమైన పండు గా దీనికి గుర్తింపు ఉంది. శీతాకాలంలో విస్తారంగా పండే ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. పోషక విలువలతో పాటు సులభంగా జీర్ణమయ్యే వీటిని మిక్కిలి ఇష్టంగా తింటారు.

పండ్లలో రకాలు : అన్నోనా జాతికి చెందిన సీతాఫలం పండులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మూడు రకాలుగా సీతాఫలాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మూడు రకాలుగా సీతాఫలాలు లభిస్తున్నాయి. ఇలి సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలంగా పేర్కొంటారు. రుచిపరంగా ఈ పండ్లలో భిన్నత్వం ఉన్నప్పటికీ గుజ్జు, గింజలు మాత్రం ఒకేలా ఉంటాయి. సంస్కృతంలో సీతాఫలం, గండగాత్రి, ఆంగ్లంలో కస్టర్ట్ యాపిల్, ఘగర్ యాపిల్, స్వీట్ యాపిల్‌గా, హిందీలో షరీఫా, సీతాఫల్‌గా వివిధ పేర్లతో వాడుకలో ఉన్నాయి. ఈ పండ్లు అన్నీ వయస్సుల వారికి ఆమోదయోగ్యమైనవే. ఈ పండు ప్రస్తావన పురాణఇతిహాసాల్లో కూడా ఉంది.

పోషక విలువలు : సీతాఫలంలో పోషక విలువల పరంగా చూస్తే ఐరన్, విటమిన్ సి, ఫాప్ఫరస్, మెగ్నీషియంలు అధికంగా లభిస్తాయి. పండు తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. 100 గ్రాముల సీతాఫలంలో భోజ్యభాగం -45 శాతం, తేమ -68.6 గ్రాములు, కొవ్వు -1.6 గ్రాములు, కార్బోహైడ్రేట్లు -26.2 గ్రాములు, పీచు పదార్థాలు -2.4 గ్రాములు, కాల్షియం- 398, ఫాస్పరస్ -40, ఇనుము-0 3, విటమిన్ సి-16, థయామిన్- 33, రైబోఫ్లోవిన్ -44, నియాసిన్- 1.3 మిల్లీ గ్రాములు ఉన్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్నపప్పడు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు, శస్త్ర చికిత్స జరిగిన తరువాత, గాయాలు మానుతున్న సమయంలో ఇవి తింటే ఎంతో మేలు జరుగుతుంది. రోజుకు ఒక సీతాఫలాన్ని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. డాక్టర్‌ను కలవాల్సిన అవసరమే ఉండదు. మెదక్ జిల్లా రాజంపేట, గజ్వేల్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, రంగారెడ్డి కీసర, నల్లగొండ జిల్లా బొమ్మలరామారం, రాజపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మొదలైన ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని కొన్ని గ్రామాల నుంచి ఎక్కువగా సీతాఫలాలను రైతు కుటుంబాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఔషధ గుణాలు : సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారిస్తోంది. తరుచుగా వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని అరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకలకు మేలు చేస్తోంది. గుండె జబ్బులు, నరాలు, కండరాల బలహీనత గల వారు వీటిని తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సీతాఫలాన్ని మిల్క్‌షేక్స్, ఐస్‌క్రీమ్, జ్యూ స్, ఫుడ్డింగ్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Comments

comments