Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

విద్యార్థి ఆత్మహత్య

STUDENT

సూర్యాపేట : తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న వేణు (13) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వేణు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో తక్షణమే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వేణు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మేళ్లచెరువు మండలం వేపల మాధవరం గ్రామానికి చెందిన వేణు దసరా సెలవులకు ముందు  పాఠశాలకు రావడం  తనకు ఇష్టం లేదని చెప్పినట్టు పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Student suicide

Comments

comments