Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

murder

మనతెలంగాణ / నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక కేసరి సముద్రం చెరువులో అనుమానాదస్పద స్దితిలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసరి సముద్రం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు తన పంచెతోనే ఊరి వేసుకున్నాడని తమకు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. చంపి తుమ్మ చెట్టుకు వేలాడదీశారా లేక తాను తుమ్మ కొమ్మకు ఉరేసుకొని చనిపోయడనేది అనేది దర్యాప్తులో బయటపడుతుందన్నారు. స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని, మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Comments

comments