Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఢిల్లీలో ‘సిద్దిపేట’, సిరిసిల్లలకు స్వచ్ఛ అవార్డుల ప్రదానం

                     Kashmir

మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశరాజధాని డిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్వచ్ఛతా హై సేవా అవార్డును సిద్దిపేట మునిసిపాల్టీకి అందజేశారు. సిద్దిపేట మునిసిపాల్టీ పరిధిలో పొడి చెత్తను సేకరించి దాన్ని రీసైక్లింగ్ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి ఎస్‌ఎస్.అహ్లువాలియా, కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రి హర్విందర్‌సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును సిద్దిపేట మునిసిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, పట్టణాభివృద్ధి శాఖల అధికారి అయ్యర్ పాల్గొన్నారు.

అవార్డు అందుకున్న పావని, రామానుజులరెడ్డి, కృష్ణభాస్కర్

మన తెలంగాణ/సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి స్వచ్ఛభారత్ అవార్డును సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల సమక్షంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, కమిషనర్ రామానుజులరెడ్డి, కలెక్టర్ కృష్ణభాస్కర్‌లు అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడవ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందశాతం ఓడిఎఫ్‌ను సాధించిన జిల్లాలుగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల నిలిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జగిత్యాల కలెక్టర్ శరత్‌లు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు.

Comments

comments