Search
Tuesday 19 June 2018
  • :
  • :

వాన పాటతో మురిపించనుంది

Tammanna

ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తన గ్లామర్‌తో అభిమానులను మెప్పిస్తూనే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. మిలమిల మెరిసే మేని లావణ్యంతో యూత్‌ను అలరించే అందం ఆమె సొంతం. ఈ అందాల తార  గతంలో బద్రీనాథ్, రచ్చ సినిమాల్లో వాన పాటలతో అభిమానులను అలరించింది. ఇప్పుడు మరోసారి తన తడి అందాలతో మైమరపించనుంది ఈ బ్యూటీ. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా చేస్తున్న సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా మరోసారి వాన పాటలో కనిపించనుంది. ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్‌టిఆర్‌తో ‘స్వింగ్ జరా…’ అంటూ స్టెప్పులేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అతని సోదరుడు కళ్యాణ్‌రామ్‌తో కలిసి వాన పాటలో స్టెప్పులేయనుంది. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘క్వీన్’లో పర్‌ఫార్మెన్స్ రోల్ చేస్తోంది తమన్నా. నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది ఈ బ్యూటీ.

Comments

comments