Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

నీలిపాదం బూబీ

harivillu-image
నీలిపాదం బూబీ అనే పక్షులు ముఖ్యంగా మధ్య అమెరికా దక్షిణతీరంలో, దక్షిణ అమెరికాలో ఉంటాయి. పేరుకు తగ్గట్టుగా వీటి పాదాలు నీలిరంగులో ఉంటాయి. బూబీ అన్న పేరు స్పానిష్ పదం బోబో నుంచి వచ్చింది. బోబో అంటే తెలివితక్కువ అని అర్థం. ఇవి అంత చురుగ్గా ఉండవు. వీటిని సులభంగా పట్టుకోవచ్చు. ఈ పక్షులు సుమారు 81 సెం.మీ. పొడవు, 1.5 కి.గ్రా. బరువు ఉంటాయి. మగ పక్షుల కంటే ఆడపక్షులు కాస్తంత పెద్దగా ఉంటాయి. ఈ పక్షులు తమ గూళ్ళను రాత్రిపూట ఏర్పాటు చేసుకుంటాయి. తెల్లవారగానే సముద్రంపైకి ఆహారం కోసం వెళ్తాయి. వీటి రెక్కల కొనలు పదునుగా ఉంటాయి. తోక గొడ్డలి ఆకారంలో ఉంటుంది. బూబీ మెడ పొట్టిగా, బలంగా ఉంటుంది.

Comments

comments