Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

పేరు మార్చుకున్న సమంత?

Samantha

హైదరాబాద్ : పెళ్లయ్యాక ప్రతి వధువు తన భర్త ఇంటి పేరును తన ఇంటిపేరుగా మర్చుకోవడం భారతదేశ సంప్రదాయం. టాలీవుడ్ అందాల భామ సమంత ఇటీవల అక్కినేని నాగచైతన్యను వివాహమాడిన విషయం తెలిసిందే. బుధవారం ఓ సామాజిక మీడియా అయిన ట్విటర్ లో తన పేరును మార్చుకున్నట్లు తెలిపింది సమంత. ఇన్నాళ్లు తన పేరు ‘‘ సమంత రూత్ ప్రభు’’అని ఉండేది. కానీ, ఇకపై ‘‘ సమంత అక్కినేని’’గా మార్చుకున్నట్లు ట్వీటర్ లో తెలిపింది. అయితే ట్విటర్ ఖాతాలో ఉన్న పేరు మాత్రమే సమంత అక్కినేనిగా ఉండగా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లలో మాత్రం ఇప్పటికీ సమంతా రూత్ ప్రభు అనే ఉంది.
కాగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘‘ రాజు గారి గది-2 ’’ ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సమంత ఆత్మ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.
సమంత తమిళ నటుడు విజయ్ తో కలిసి నటించిన ‘ అదిరింది’ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘రంగస్థలం 1985’’చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.samantha

Tollywood Actress Samantha who changed her surname

Comments

comments