Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

తేజతో వెంకటేశ్ చిత్రం?

Venky

హిట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత దర్శకుడు తేజ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఈ సినిమాతో టిపికల్ సబ్జెక్ట్‌లను అద్భుతంగా తెరకెక్కించగలడన్న గుర్తింపు సాధించుకున్నాడు. దీంతో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలు తేజతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు. వెంకటేష్‌తో ఓ చిత్రానికి తేజ కమిట్ అయ్యాడని తెలిసింది. దీంతో పాటు నందమూరి బాలకృష్ణ నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి కూడా ఈ దర్శకుడు ఓకే అన్నాడని అంటున్నారు. వీటిలో తేజ ఏది ముందుగా మొదలుపెట్టనున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’ ద్వారా అవకాశం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లోనే తన నెక్స్ మూవీ చేస్తాడట తేజ. అంటే వెంకటేష్‌తోనే ముందుగా సినిమా చేస్తాడన్న మాట. ఇప్పటికే ఈ సీనియర్ స్టార్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా ప్రారంభమైపోయాయని తెలిసింది.
స్పెషల్ రోల్‌లో…
నాగచైతన్య హిట్ మూవీ ‘ప్రేమమ్’లో ఓ స్పెషల్ రోల్ చేసిన వెంకటేష్ మరోసారి అతిథి పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. అఖిల్ రెండో చిత్రంలో ఆయన గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ రోల్‌లో వెంకటేష్ దర్శనమివ్వనున్నాడని సమాచారం. ఇందులో ఆయన కొద్ది నిమిషాల పాటు తళుక్కున మెరువబోతున్నాడని తెలిసింది.

Comments

comments