Search
Monday 11 December 2017
  • :
  • :

రూ.999కే వొడాఫోన్ 4జి స్మార్ట్ ఫోన్

vodafone

న్యూఢిల్లీ: టెలికామ్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిలయన్స్ జియో ప్రవేశించినప్పటి నుంచి ప్రత్యర్థి కంపెనీలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. జియో ఫోన్‌కు ఫోటీగా ఇతర టెలికామ్ సంస్థ లు కూడా పోన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరకే ఫోన్‌లను అందించనున్నట్టు ప్రకటించాయి. తాజాగా వొడాఫోన్ కూడా దేశీ య సెల్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌తో కలిసి భారత్-2 పేరుతో 4జితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను రూ. 999కే తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీని ధర రూ. 2899 కాగా, 36 నెలల తర్వాత వొడాఫోన్ రూ. 1,900 తిరిగి వినియోగదారుడికి చెల్లించనుంది. ఇప్పటికే మైక్రోమ్యాక్స్‌తో కలిసి ప్రభుత్వ రంగ బిఎస్‌ఎన్‌ఎల్ భారత్-1 4జి ఫీచర్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. కార్బన్‌తో కలిసి ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుం ది. ఇప్పుడు వొడాఫోన్ భారత్-2 అల్ట్రా పేరుతో 4జి స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టనుంది. మైక్రోమ్యాక్స్ భారత్-2 అల్ట్రా ఫీచర్లు.. 4 అంగుళాల తెర, 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జిబి మెమొరీ, 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 1300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి.
వొడాఫోన్ రూ. 399 ప్లాన్
వొడాఫోన్ మరో భారీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.399కు 90జిబి 4జి డేటాను అందివ్వనున్నట్లు ప్రకటించింది. దీనిని ఆరు నెలలపాటు వినియోగించుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా అపరిమిత లోకల్‌కాల్స్, ఎస్‌టిడి కాల్స్ చేసుకునే వెసులుబాటును కూడా అందిస్తోంది. రూ.399 పెట్టి రీఛార్జ్ చేసుకున్న వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులు 90జిబి డేటాను ఒకే రోజు వినియోగించుకోవచ్చని లేదా ఆరు నెలలపాటు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. రూ.399కి 90జిబి అంటే రూ.4.43కే 1జిబి అందుకోవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థలు కూడా రూ.399 ప్లాన్‌ను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌పై రోజుకు ఒక జిబి చొప్పున 70 రోజులు 4జి డేటాను అందిస్తోంది. రూ.399కి జియో రోజుకు 1జిబి చొప్పున 84 జిబి అందించగా, ఇప్పుడు దాన్ని 70 రోజులకు వ్యవధికి కుదించిన విషయం తెలిసిందే.

Comments

comments