Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

ట్రాఫిక్ ఎస్‌ఐపై యువకుడి దాడి

Man-Attack-on-Traffic-Polic

జగిత్యాల : జగిత్యాలలో ట్రాఫిక్ ఎస్‌ఐపై మద్యం మత్తులో ఉన్న యువకుడు దాడి చేసి గాయపరిచిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల ట్రాఫిక్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో శనివారం రాత్రి వాహనాల తనీఖీ చేపట్టారు. అదే సమయంలో మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చిత్తుగా మద్యం తాగి ద్విచక్రవాహనంపై వెళ్లుతుండగా పోలీసులు వారి వాహనాన్ని ఆపారు. వాహనానికి సంబంధించిన ధృవపత్రాలను చూపించాలని కానిస్టేబుల్ అడగగా ఎందుకివ్వాలంటూ దుర్భాలాషడారు.

వారి తీరును పక్కనే ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐ లక్ష్మినారాయణ దృష్టికి సిబ్బంది తీసుకెళ్లారు. దాంతో ఎస్‌ఐ ఆ యువకులను పిలిచి బ్రీత్ ఆనలైజర్ పరీక్ష నిర్వహిస్తుండగా అందులోంచి ఇరువురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి గద్దె శంకర్‌కు పరీక్ష జరుపుతుండగానే హఠాత్తుగా ఎస్‌ఐపై దాడి చేసి నీవెవరంటూ నానా దుర్భాషలాడుతూ ఎస్‌ఐపై చేయి చేసుకున్నాడు. ఎస్‌ఐని బలంగా నెట్టివేయడంతో ఆయన రోడ్డుపై పడి గాయపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా, సదరు యువకుడు గత కొంత కాలంగా రాంపూర్‌లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

Comments

comments