Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

అటవీశాఖ ఉన్నతాధికారి గుండెపోటుతో మృతి

Heart-Attack

ఆదిలాబాద్: జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారి సంజయ్‌కుమార్ గుప్తా(48) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇజిసి సాధారణంగా ఉందని, కేవలం గ్యాస్ సమస్య అని వైద్యులు చెప్పారు. దాంతో కుటుంబీకులు ఇంటికి తీసుకువచ్చారు. కానీ, ఇవాళ ఉదయం అధికారిక నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా సంజయ్‌కుమార్ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి చనిపోయారు. గుప్తా స్వస్థలం యుపి కాగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆదిలాబాద్ కలెక్టర్ బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతి సంజయ్‌కుమార్త్ మృతదేహానికి నివాళులర్పించారు.

Forest Officer Died with Heart Attack in Adilabad.

Comments

comments