Search
Wednesday 22 November 2017
  • :
  • :

తొలినాళ్ల గెలాక్సీ

ANCIENT-SPIRAL-GALAXY

ఆస్ట్రేలియాకు చెందిన  స్విన్‌బర్న్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం 1100 కోట్ల సంవత్సరాల కిత్రం ఏర్పడిన నక్షత్ర మండలాన్ని కనుగొన్నారు. హవాయ్‌లోని జెమినీ నార్త్ టెలీస్కోప్‌ను ఉపయోగించి   ఈ అత్యంత ప్రాచీనమైన  గెలాక్సీని గుర్తించారు. దీనికి ‘ ఏ1689బి11’ అని పేరు  పెట్టారు. ఈ గెలాక్సీ బిగ్‌బ్యాంక్ సమయంలో పుట్టిందని, ఇది కేవలం 260 కోట్ల ఏళ్లు మాత్రమే బతికిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిపై పరిశోధనలు జరపడం ద్వారా విశ్వం తొలినాళ్లలోని పరిస్థితులను అధ్యయనం చేయవచ్చంటున్నారు. ఈ గెలాక్సీలు వేగంగా నక్షత్రాలను సృష్టిస్తాయని,  వీటి జీవితకాలం కూడా తక్కువేనని బృందానికి నేతృత్వం వహిస్తున్న తియన్‌టియాన్ యువాన్ తెలిపారు.

Comments

comments