Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఎస్‌బిఐ లాభం రూ.1,840 కోట్లు

 38 శాతం తగ్గిన స్టాండలోన్ లాభం
 అంచనాలకు మించిన నికర వడ్డీ ఆదాయం
 తగ్గిన స్థూల నిరర్థక ఆస్తులు

SBI

ముంబయి : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ రెండో త్రైమాసిక ఫలితాల్లో లాభం అనేక రెట్లు పెరిగింది. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సురెన్స్‌లో వాటాను విక్రయించ డం ద్వారా క్యూ2 (జులైసెప్టెంబర్)లో నికర లాభం రూ.1,840.43 కోట్లు వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.20.70 కోట్లుగా ఉంది. మరింత వృద్ధి దిశగా చర్యలు చేపట్టామని ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. త్రైమాసికంత్రైమాసికం ఆధారంగా చూస్తే ఎస్‌బిఐ లాభం రూ.2,538.32 కోట్ల నుంచి రూ.1,581.55 కోట్లకు తగ్గింది.. అంటే 38 శాతం క్షీణించింది. మొండి బకాయిల కారణంగానే ఆదా యం తగ్గినట్లు బ్యాంకు పేర్కొంది. స్టాండ్‌లోన్ ప్రాతిపదికన బ్యాంకు మొత్తం ఆదాయం రూ.65,429 కోట్ల కు పెరగ్గా.. గతేడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ. 50,742.9 కోట్లుగా ఉంది. ఈమేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఎక్సేంజ్‌కు ఫైలింగ్‌లో తెలిపింది. ఇక బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు రూ.7.14 శాతం ను ంచి రూ. 9.83 శాతానికి పెరిగాయి. నికర నిరర్థక ఆస్తు లు కూడా 4.19 శాతం నుంచి రూ.5.43 శాతానికి పెరిగాయి. ఇక ఏకీకృత ప్రాతిపదికన బ్యాంకు ఆదాయం రూ.74,948.52 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 72,918.4కోట్లుగా ఉంది. ఎన్‌పిఎకు కేటాయింపులు రూ.7,669.66 కోట్ల నుంచి రూ.16,715.20 కోట్లకు పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం త్రైమాసికంత్రైమాసి కం ఆధారంగా 100.96 శాతం, ఏడాదిఏడాది ఆధారంగా చూస్తే 57.85 శాతం వృద్ధి చెందింది. నికర వడ్డీ మార్జిన్ 2.59 శాతం కాగా,  ఏడాదిలో 2.98 శాతం ఉంది. నిరర్థక ఆస్తుల కేటాయింపులు రూ. 16,175.20 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇవి జూన్ త్రైమాసికంలో రూ.12,125.26 కోట్లు, గతేడాది ఇదే సమయంలో రూ.7,669.66 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తులు క్యూ1తో పోల్చితే స్వల్పం గా తగ్గాయి. ఫలితాల అనంతరం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఎస్‌బిఐ షేరు విలువ 6.41 శాతం లాభపడి రూ.333.80కు చేరుకుంది.

Comments

comments