Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

‘2.0’ టీజర్, ట్రైలర్ రిలీజ్ వాయిదా?

2.0

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్, క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ‘2.0’. ఈ చిత్రాన్ని దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె దుబాయ్‌లో ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలస్తుంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 22న హైదరాబాద్‌లో, ట్రైలర్‌ను డిసెంబర్ 12న చెన్నైలో రిలీజ్ చేయాలని చిత్రంబృందం అనుకున్నారు. కానీ ఆ తేదీల్లో అనుకున్నట్లు ఈవెంట్ల్లు జరిగే అవకాశం లేదని, తర్వలోనే చిత్రయూనిట్ కొత్త తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా విడుదల తేదీపై కూడా చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టతా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించగా, అందాల భామ అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Comments

comments