Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రాజులు పోయినా … రాజ్యాలు కూలినా..! (వీడియోతో సహా)

Nizamabad_Dalit

హైదరాబాద్ : రాజులు పోయారు… రాజ్యాలు కూలాయి. కానీ స్వతంత్య్ర భారత్‌లో మాత్రం అగ్ర వర్ణాలు నిమ్నజాతులపై చేస్తున్న దాడులు మాత్రం ఆగడం లేదు. అనునిత్యం రోజుకో ప్రాంతంలో నిమ్న జాతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలో కూడా కులం పేరుతో దూషిస్తూ, దాడులు చేస్తూ అగ్రవర్గాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు యత్నిస్తున్నాయి. ఇటువంటి ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. బిజెపి నేత భరత్‌రెడ్డి అక్రమంగా మోరం(మట్టి)ను తరలిస్తుండగా దళిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్ అడ్డుకున్నారు. దీంతో భరత్‌రెడ్డి వారిని కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగాడు. అంతేకాదు సమీపంలోని బావిలోకి దిగి మునగమని బెదిరిస్తూ చేతిలో కర్ర పట్టుకుని వారిని కొడుతూనే హల్‌చల్ చేశాడు.

చేతిలో కర్రతో.. దుర్భాషలాడుతూ.. !

బిజెపి నాయకుడిగా చెలామణి అవుతున్న భరత్ రెడ్డి తన అక్రమాలను అడ్డుకునేందుకు యత్నించిన దళిత యువకులను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూనే కర్రతో కొట్టేంతపని చేశాడు. సమీపంలోని బావిలో దిగి, నీట మునిగి తనకు క్షమాపణ చెప్పాలంటూ కర్రతో కొట్టబోతూ దళితులపై దాడికి పాల్పడ్డాడు. మొరం తీసుకోమని ప్రభుత్వం నాకు అనుమతిచ్చిందని బూకాయించాడు భరత్ రెడ్డి. ఈ దృశ్యాన్ని తనతోపాటు  అనుచురులతో వీడియో తీయించాడు. ఆ వీడియో ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా చెక్కర్లు చుడుతోంది.

భరత్ రెడ్డిపై నెటిజన్ల మాటల దాడి: భరత్ రెడ్డి అక్రమాలను అడ్డుకున్న దళిత యువకులపై దాడిని తెలుగు నెటిజన్లు తీవ్రంగా ఖండ ిస్తున్నారు. ఆధుని యుగంలోనూ కుల వివక్ష చూపడం సరైంది కదని, దళితులను చిన్న చూపు చూడ్డం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీల నాయకులుగా చెలామణి కావడం సిగ్గు చేటని విమర్శించారు. భరత్ రెడ్డి చేసిన నిర్వాకానికి అగ్రవర్ణాలకు చెడుపేరు వస్తోందనని సోషల్ మీడియాలో పలువురు వారి అభిప్రాయాలను వెల్లడించారు. భరత్ రెడ్డి దళిత యువకుల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలంటూ పలువురు సామాజిక మాధ్యమాల కార్యకర్తలు డిమాండ్ చేశారు.

బిజెపి కార్యకర్త కాదు..భరత్ రెడ్డి బిజెపికి చెందిన లీడర్ అంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ప్రతినిధి ఒకరు స్పందించారు. భరత్ రెడ్డిని తమ పార్టీ నాయకుడిగా నియమించలేదని, అతను కేవలం మిస్డ్ కాల్ ద్వారానే తమ పార్టీకి సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

భరత్ రెడ్డిని అరెస్టు చేయాలి..అసదుద్దిన్

నిజామాబాద్ జిల్లాలో దళిత యువకులపై దాడికి యత్నించిన బిజెపి నాయకుడిగా చెలామణి అవుతున్న భరత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సిఎంఓ,  ఐటీ మంత్రి కెటిఆర్, హోం మంత్రి నాయినీ నర్సింహారెడ్డిలకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇలాంటి దాడులు పునరావృకాకుండా చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు. ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

2 Dalits ‘punished’ in Telangana allegedly by BJP man, forced to dip in water

Comments

comments