Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

200 వస్తువుల రేట్లు తగ్గొచ్చు

gst

* నిత్యావసర వస్తువులపైనే ప్రధానంగా చర్చ

* నేడు జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం తర్వాత రానున్న స్పష్టత

ముంబయి: చాలావరకు సాధారణ వస్తువులపై పన్ను రేట్ల ను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. గురువారం గువహటి లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రెండు రోజుల పాటు ఈ సమావేశం ఉంటుంది. నేడు(శుక్రవారం) చర్చిం చిన అనంతరం జైట్లీ ప్రకటన చేయనున్నారు. అయితే సా మాన్యులు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) రేట్లను తగ్గించే విషయమై సమావేశం లో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయం లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్‌ఎంఇ)కు మరింత ఊరటనివ్వనున్నారని అంచనా వేస్తున్నారు. ఎస్‌ఎంఇలకు పన్ను భారం తగ్గిస్తారని అంతా ఆశిస్తున్నారు. 28 శాతం పన్ను శ్లాబ్ పరిధి నుంచి వస్తువుల జాబితాను తగ్గించనున్న ట్టు ఇప్పటికే జైట్లీ సంకేతాలు ఇచ్చారు. తాము క్రమక్రమం గా పన్ను రేట్లను తగ్గిస్తూ వస్తున్నామని, ఆదాయం తగ్గిన పలు సంస్థలకు ఊరట కల్గించేలా నిర్ణయాలు తీసుకుంటు న్నామని అన్నారు. జిఎస్‌టిఎన్(వస్తు, సేవల పన్ను నెట్ వర్క్) ప్యానెల్‌కు హెడ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ, 200 నిత్యావసర వస్తువులపై రేట్లు తగ్గనున్నాయని, శుక్రవారంనాడు 28 శాతం నుంచి 18 శాతానికి ఈ రేట్లను తగ్గించే అవకాశముందని అన్నా రు. చేతితో తయారు చేసిన ఫర్నిచర్‌లకు పన్నును తగ్గించే అవ కాశముంది. అసంఘటిత కార్మికులు తయారు చేసిన ఈ ఫర్నిచర్ చాలా వరకు చేతితో తయారుచేసినవే, వీటిపై రేట్ల ను తగ్గించాలనే డిమాండ్ ఉంది. ప్లాస్టిక్ వస్తువులు కొన్ని 18 శాతం జిఎస్‌టిలోకి వస్తాయని, అయితే షవర్ బాత్‌లు, సింక్‌లు, వాష్ బేసిన్‌లు, సీట్లు, కవర్లు, శానిటరీ వస్తువులు వంటి వాటిపై 28 శాతం జిఎస్‌టి విధించ నున్నట్టు తెలుస్తోంది.

Comments

comments