Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పాపం..పసిప్రాణాలు

docter

*పౌష్టికాహారం అందక హరీ మంటున్న ప్రాణాలు
*శిశు గృహాల్లో 3 నెలల్లో 9 మంది మృతి
*బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్

నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశు గృహాంలో గడిచిన 3 నెలల్లో 9 మంది శిశువులు మరణిం చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పౌష్టికాహర లోపంతో శిశువులు మృతి చెందడం వెనుక ప్రభుత్వ అధికారులు పూర్తి నిర్లక్ష వైఖరే కారణమని విమర్శలు వెల్లువెత్తు తు న్నాయి. శిశుగృహంలో 50 మంది అనాథ శిశువులుండగా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డయేరియా, వెయిట్ లాస్, ఇన్‌ఫెక్షన్ రోగాలతో 9 మంది శిశువులు మరణించారు. ఈ మరణాల వెనుక అధికారుల పర్యవేక్షణ లోపం, బాధ్యాత రాహిత్యం, అక్రమాలకు పాల్పడుతుండటంతో శిశువులు మరణిస్తు న్నారు. శిశు గృహంలో ఆయాలు కూడ సక్ర మంగా లేక పోవడం శిశువులకు ఏ పిల్లల డాక్టర్ సూచించని, విషపూరితమైనవిగా భావి స్తున్న “టెట్రాప్యాక్‌” పాలను శిశువులకు పట్టి స్తున్నారు. దీనివల్ల శిశువులు వివిధ రోగాల బారిన పడి ప్రాణాలు వదులుతున్నారని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. శిశుగృహాను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ప్రభు త్వ కేంద్ర ఆసుపత్రిలో పని చేసే ప్రభుత్వ పిల్లల డాక్టర్ పర్యవేక్షించాల్సి ఉండగా కమీషన్లకు కక్కుర్తిపడి శిశుగృహ అధికారులు ప్రైవేటు డాక్టర్ ను నియమించుకోవడం అధికారుల అక్ర మానికి అద్దంపడుతుంది. ప్రభుత్వ కేంద్ర ఆసు పత్రిలో 6 గురు పిల్లల డాక్టర్లు ఉన్నా వీరిని కాదని వైద్యం చేయించే ఖర్చుల కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆ తర్వాత కాలయాపన జరిగి రోగం ముదిరిన తర్వాత హైదరాబాద్‌లోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రికి తరలించడం అక్కడ శిశువులు మర ణించడం జరుగుతుంది. ఈ టెట్రాప్యాక్ విష పూరితమైన పాలను దేశంలో ఎక్కడా వాడకు న్నా ఈ శిశు కేంద్ర అధికారిణి వాడటం వల్లనే శిశువులు మరణిస్తున్నారని నీలోఫర్ డాక్టర్లు కూడా నిర్ధారణ చేస్తున్నారు. చిన్నారులు ప్రస్తు తం 7 గురు యన్.ఆర్.సి ప్రభుత్వ కేంద్ర ఆసు పత్రి విభాగంలో వైద్యం పొందుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో ముగ్గురు శిశువులు చావు బతుకుల్లో ఉన్నారు. కనీసం శిశువులకు మూత్ర విసర్జణ చేసిన అనంతరం మార్చాల్సిన డైపర్లు కూడా మార్చకపోవడం శిశువుల దుస్థితికి అద్దం పడుతోంది.. శిశువులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించకుండా డబ్బులకు కక్కుర్తిపడి వైద్య సౌకర్యాలు మందులు వాడకుండా డబ్బులను నొక్కేసి శిశువులను చంపేస్తున్నారు. కనీసం వైద్య పరిజ్ఞానం లేని ఆయాలను నియమించడం వెనుక పెద్ద తతంగం ఆరోపి స్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 మంది శిశువుల మరణానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, శిశువులకు ప్రభుత్వ డాక్టర్ చేత చికిత్స చేయించకుండ ప్రైవేటు డాక్టర్‌కు ఎందుకు చూపిస్తున్నారు అని భారతీయ జనతాపార్టీ నేతలు, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రశ్నించారు. మందులు ఏఏ మెడికల్ షాపు నుండి కొనుగోలు చేస్తు న్నారు, కనీసం డైపర్లను కూడా మార్చడం లేదా? ఇన్‌ఫెక్షన్ రోగం రావడానికి డైపర్లు మార్చకపోవడమా? ఎన్నో సంవత్సరాల నుండి శిశుగృహకు ప్రతి రోజు ప్రభుత్వ డాక్టర్ వెళ్ళితే రూ. 10 వేలు గౌరవ వేతనం లభిస్తుంది. కానీ దీనిని కాలరాసి ప్రయివేటు డాక్టర్‌ను నియ మించుకోవడంలో అంతర్యం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆడ పిల్లలను కాపాడలనే ఉద్దేశ్యంతో ఊయల పథకం కింద కోట్లాది రూపాయలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా నిధులను ఇస్తుండగా జిల్లా కేంద్రం శిశు గృహా లోని పిల్లలు పౌష్టికాహర లోపంతో చనిపోవడం పట్ల తదితర అంశాలపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
మరింత శ్రద్ద వహించేలా చర్యలు తీసుకుంటాం : కలెక్టర్
శిశుగృహలో శిశువుల ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ద వహించేలా చ్యలు తీసుకుంటామని కలెక్టర్ చె ప్పారు. శిశువుల మరణాలపై వివిధ పార్టీల నేతల నుంచి ఆరోపణలు రావడంతో కలెక్టర్ హుటాహుటిన శిశుగృహను సందర్శించి వివ రాలు అడిగి తెలుసుకున్నారు. పుట్టగానే బిడ్డల ను వదలివెళ్ళడం వల్ల తల్లి ముర్రుపాలు తాగక శిశువు పౌష్టికాహర లోపానికి గురై వ్యాధుల బా రిన పడుతున్నారని అన్నారు. మహిళా అధికా రి నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ, 5గురు డాక్టర్ల బృందంచే మరోకమిటీని వేసి మూడు రోజులలో శిశుగృహకు అవసరమైన సేవలను గుర్తించి అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలి పారు. 8 మంది స్టాఫ్ నర్సలను శిశుగృహలో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Comments

comments