Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

పెళ్లిపీటలెక్కబోతున్న..నమిత

namita
చెన్నై: ప్రముక నటి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. నవంబర్ 24న తన ప్రియుడు వీరెంద్ర చౌదరితో తిరుపతిలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్బంగా నమిత తొలిసారి తనకు కాజోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు అందరితో పంచుకున్నారు. ‘వీర్ నా బెస్ట్ ఫ్రెండ్. అంతే కాకుండా తాను మంచి నిర్మాత, మంచి నటుడు కూడా. మాది పెద్దలు నిశ్చయించిన ప్రేమ వివాహం. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన శశిధర్ బాబు 2016 నాకు వీర్‌ని పరిచయం చేశారు. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ‘2017 సెప్టెంబర్ 6న బీచ్‌లో నాకు ప్రపోజ్ చేశారు. నేనసలు అలాంటి సర్‌ప్రైజ్‌ని నా లైఫ్‌లో వూహించలేదు. మా ఇద్దరి అభిరుచులు, అలావట్లూ ఒకటే. దాంతో వీర్‌కి ఓకే చెప్పేశాను. మీ ఆశ్వీర్వాదాలు ఎల్లప్పుడు మాపై ఉండాలని కోరుకుంటున్నాను.

Comments

comments