Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నవంబరు 24న నటి నమిత పెళ్లి

NAMITHA

చెన్నయ్ : ప్రముఖ నటి నమిత పెళ్లి నిర్మాత, నటుడు వీరేంద్ర చౌదరితో ఈనెల 24న తిరుపతిలో జరగనుంది. ఈ విషయాన్ని నమితి వెల్లడించారు. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా నమిత తనకు కాబోయే భర్త వీరేంద్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వీర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె పేర్కొన్నారు. తమ కామన్ ఫ్రెండ్ శశిధర్ ద్వారా వీరేంద్ర తనకు పరిచయమయ్యాడని ఆమె తెలిపారు. 2017 సెప్టెంబరు 6న బీచ్‌లో క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేసి వీరేంద్ర తనకు ప్రపోజ్ చేశాడని, తమ ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే కావడంతో వీరేంద్ర ప్రపోజ్‌కు ఓకే చెప్పినట్టు నమిత వెల్లడించారు. తమకు అభిమానుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

Actress Namitha to marry her longtime friend Veerandra Chowdhary on November 24th

Comments

comments