Search
Wednesday 22 November 2017
  • :
  • :

ఆస్పత్రి బెడ్‌పై నటి… వైరల్‌గా మారిన ఫోటోలు

isha
ముంబయి: ఈ మధ్య సోషల్ మీడియాలో బాలీవుడ్ నటి ఇషా గుప్తా అసభ్యకర ఫోటోలు పోస్ట్ చేస్తూ వార్తలోకెక్కిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అందుకు కారణం.. ఆస్పత్రిలో బెడ్‌పై పడుకుని ఓ పక్క చేతికి సెలైన్‌తో ఉన్న ఇషా అక్కడ కూడా ఫోటోలు దిగడం వైరల్‌గా మారింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇషా కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అయితే ఆమె ఆస్పత్రి బెడ్‌పై కూడా స్టైల్‌గా కళ్ల అద్దాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇషా తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తూ… ‘త్వరగా కోలుకుంటాను. అందరికీ ధన్యవాదాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆస్పత్రిలోనూ ఫోటోల పిచ్చేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ ఇషా పొట్టి దుస్తువులు వేసుకుని ఫోటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లపై నెటిజన్లు ఘాటుగానే కామెంట్లు గుప్పించారు. తనపై కామెంట్లు చేసే బదులు నెటిజన్లు తన ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిదని ఇషా వ్యాఖ్యానించింది కూడా.

Comments

comments