Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ 3 కొత్త ఆఫర్లు

Airtel

న్యూఢిల్లీ: టెలికామ్ మార్కెట్‌లో పోటీ తీవ్రమైన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ మరో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ జియోకు ధీటుగా రూ.3,999, రూ.1,999, రూ.999 పేరిట కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఈ మూడు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. మొదటి ఆఫర్ కింద రూ.3,999 చెల్లిస్తే 360 రోజుల పాటు 300 జిబి డేటాను అందిస్తోంది. దీంతో పాటు అన్ని రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక రూ.1,999 ప్లాన్‌తో కస్టమర్లకు 125 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. దీనికి కూడా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపే అవకాశం, అలాగే ఈ ప్లాన్ వ్యవధి 180 రోజులుగా ఉంది.మరో ఆఫర్ రూ.999 ప్లాన్ రీచార్జి చేసుకుంటే యూజర్లకు 60 జిబి డేటా , అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టిడి కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 90 రోజులు వాలిడిటీ ఉంటుంది. అయితే ఇటీవల జియోలో కూడా రూ.999, రూ.1,999 ప్లాన్లకు ఇదే తరహా ఆఫర్లను చేసింది. కాకపోతే అందులో రూ.3,999 ప్లాన్ లేదు. దానికి బదులుగా రూ.4,999 ప్లాన్ ఉంది. అందులో 350 జీబీ డేటా వస్తుంది. దాని వాలిడిటీ కూడా 360 రోజులు కావడం విశేషం.

Comments

comments