Search
Sunday 27 May 2018
  • :
  • :

ఎయిర్‌టెల్ ఆఫర్: రూ.349 ప్లాన్‌పై అదనపు డేటా

Airtel

ముంబయి: రిలయన్స్ జియోకు పోటీగా ఇతర టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు రోజుకో కొత్త ఆఫర్లతో ముందుకువస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమ వినియోగదారుల కోసం పలు ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌టెల్ తాజాగా మరో ఆఫర్ తీసుకువచ్చింది. కాగా, ఎయిర్‌టెల్ పాత ప్లాన్ రూ.349పై ఈ ఆఫర్ కింద అదనపు డేటా అందించనుంది. ఇంతకుముందు రూ.349 ప్లాన్‌పై రోజుకు 1జిబి 4జి డేటా అందిస్తుండగా… ఇప్పటి నుంచి 1.5 జిబి 4జి డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అలాగే రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్, 3000 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. కాలపరిమితిలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందులాగే 28 రోజుల కాలపరిమితి ఉంటుంది.

Airtel’s Rs 349 plan offers 1.5GB data per day.

Comments

comments