Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

తండ్రికి పట్టెడన్నం పెట్టని కసాయి తనయుడు

Old-man-image

దిక్కు తోచని స్థితికి దిగజారిన వయోవృద్ధుడు ఆస్తులు కూడ గట్టుకొని తండ్రిని గెంటివేసిన కన్నకొడుకులు

మన తెలంగాణ/సూర్యాపేట : చిన్నతనం నుండి తన కుమారులను ఆలన,పాలనతో లాలించి, పెంచి పెద్ద చేసిన తండ్రికి నేడు కూడు కరువైంది. అతని వద్ద ఉన్న ఆస్తులను, ధనాన్ని తీసుకొని తండ్రిని మరిచారు. వృద్ధాప్యంలో తన తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన కుమారులు తమ ఇంటి నుండి గెంటి వేసిన హృదయ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చివరకు వృద్ధుడు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. స్థానిక 27వ వార్డులోని మామిళ్లగడ్డకు చెందిన వయో వృ ద్ధుడు కంబాలపల్లి వీరయ్య శుక్రవారం తమగోడును పోలీ సుల ముందు వెళ్లబుచ్చుకున్నాడు. వీరయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉండగా అందరి పెళ్లిళ్ళు చే శాడు.

అనంతరం అతనికి ఉన్న ఆస్తి మొత్తాన్ని కొడుకుల కు రాసి ఇవ్వగా వారు అ ఆస్తిని అమ్ముకున్నారు. వచ్చిన డబ్బుతో వారి పేరున ఇళ్లు కొనుగోలు చేశాడు. ఇంతలో వీరయ్య ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుండి కొద్ది రోజుల పాటు నెలకొకరిగా చూసుకున్న కుమారులు ఇకపై చూడ మని తేల్చి చెప్పి ఇంటి నుండి గెంటి వేశారు. దిక్కుతోచని స్థితికి దిగజారిన వృద్ధుడు స్థానిక 26వ వార్డులో తన పెద్ద కూతురు వద్దకు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. అదే సమయంలో తన అల్లుడికి (కూతురు భర్త) పక్ష వాతం రావడంతో కూతురు అటు భర్తను, ఇటు తండ్రిని పోషించడం భార మైంది.

శుక్రవారం మరో సారి తన కుమారులను బతిమిలా డుకొని పట్టెడన్నం కోసం ప్రాథేయపడడానికి వెళ్లిన వృద్ధున్ని ఇంటి ముందే నిల్చోబెట్టారు. జిల్లా కేంద్రం లోని హమాలీలుగా పని చేస్తున్న తన కుమారులు కంబా లపల్లి శ్రీరాములు, కంబాలపల్లి అంజ య్యల అనాలోచిత నిర్ణయాలతో కుమిలి పోయిన కురవృద్ధుడు ఏమి చేయలేని స్థితిలో చివరకు పట్టణ పోలీ సులను ఆశ్రయించాడు. ఎలా గైన తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు మొర పెట్టుకున్నారు.తన కుమారులు తన భార్యను కూడ చూడక పోవడం వల్లే అనా రోగ్యంతో మృతి చెందిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. చివరకు తమ పరిస్థితి కూడ అలాగే ఎదురవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

Comments

comments