Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

నిధులు ఉన్నా కాలయాపనే!

rent

-స్వంత భవణాలు ఉన్నా ప్రయోజనం సున్నా
-అసంపూర్తిగా అంగన్ వాడి భవణాలు
-అద్దెఇండ్లల్లో అంగన్ వాడి సెంటర్లు
-ఒక్కో భవణానికి 4లక్షల రూపాయల మంజూరు
సదాశివనగర్:అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడి భవణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎన్నార్‌ఇజిఎస్ నిధుల నుండి ఒక్కో భవణానికి 4లక్షల రూపాయలు మంజూరు చేసింది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా అధికారులు ,ప్రజా ప్రతినిధులు అలసత్వంతో ఇప్పటికి పనులు ప్రారంభం కాలేదు. సదాశివనగర్ మండల కేంద్రంలో 4 , కుప్రియాల్ 1, ధర్మారావ్ పేట్ 2, మోడేగావ్ 1, పద్మాజివాడి 2, అడ్లూర్ ఎల్లారెడ్డి 3 అంగన్ వాడి భవణాలు అసంపూర్తిగా ఉన్నాయి. గతంలో ఒక్కో భవణానికి 6లక్షల 50 వేల రూపాయలు మంజూరయ్యాయి. దీంతో భవణాలు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్‌లు భవణాలను అసంపూర్తిగా వదిలేశారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన భవణాలను శిథిలావస్థలోకి చేరుకుంటున్నాయి. స్వంత భవణాలు ఉండికూడా అవి పూర్తి కాకా అద్దెభవణాల్లో అంగన్ వాడి సెంటర్లను కొనసాగిస్తుండడంతో జిల్లా ఉన్నతాధికారులు భవణ నిర్మాణాలకు నిధులను మంజూరు చేశారు. ఐనప్పటికి వాటి నిర్మాణం కొరకు కాంట్రాక్టర్‌లు ఎవరూ ముందుకు రకపోవడంతో పనుల్లో అలసత్వం జరుగుతుంది. అంగన్ వాటి సెంటర్లలో చిన్న పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు అక్షరాలు నేర్చుకుని పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉండడానికి గ్రామాల్లో గర్భిణీలు, బాలింతలు ,కిశోర బాలికలకు అనేక సేవలు అందించాల్సి ఉంటుంది. స్వంత భవణాలు ఏకపోవడంతో అద్దెభవణాల్లో కనీస సౌకర్యాలు లేదు దీంతో ప్రభుత్వం అందిస్తున్న సరుకులు భద్రపరచడానికి చోటు ఉండడం లేదని దీంతో అంగన్ వాటి సిబ్బంది సరుకుల భద్రత కోసం అనేక తిప్పలు పడుతున్నారు. అలాగే అద్దెఇళ్ల యజమానులు సెంటర్లను ఖాలీ చేయాలని లేదంటే అద్దె ధరను పెంచి ఇవ్వాలని పట్టుపడుతుండడంతో అంగన్ వాడి టీచర్లకు ఏమీ తోచక గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన పనుల్లో కాలయాపన చేయడంపై ఆయా గ్రామాల్లోని ప్రజలు అసహణం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని చొరవ తీసుకుని భవణ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
సిడిపివో సంధ్యారాణి…
అంగన్ వాడి బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టినప్పుడు నిధులు సరిపోక పన్నులను నిలిపి వేశారు. ఇప్పుడు వాటి నిధులు మంజూరు అయ్యాయి. ఇవి పంచాయతీ రాజ్ శాఖ వారికి అప్పజెప్పడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో రామారెడ్డి మండలంలో 1 అసంపూర్తి భవణాన్ని పూర్తి చేశారు. మిగతా నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంది.
పంచాయతీ రాజ్ ఏఈ గౌసుద్దీన్ …
గతంలో అంగన్ వాడి బిల్డింగ్‌కు 6లక్షల 50వేలు మంజూరయ్యాయి. బిల్డింగ్ నిర్మాణానికి ఆ నిధులు సరిపోక పోవడంతో పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఒకో భవణానికి గాను ఎన్నార్ ఇజిఎస్ నిధుల నుండి 4లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులు సర్పంచ్‌ల ఖాతాల్లోకే వెళతాయి. కాబట్టి వారినే ఈ భవణ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించాం. త్వరలోనే పనులను ప్రారంభిస్తాం.

Comments

comments