Search
Wednesday 22 November 2017
  • :
  • :

సైనా నెహ్వాల్ కు అనుష్క శర్మ బహుమతి

saina

సీనియర్ బ్యాడ్మింటన్ షిప్ లో ఇటీవల విజయం సాధించిన ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక బహుమతి పంపారు. ‘నుష్’ పేరుతో టెక్స్ టైల్ వ్యాపార రంగంలోకి అనుష్క శర్మ అడుగుపెట్టిన విషయం ఇది వరకు తెలిసిందే. తమ సంస్థకు చెందిన కొన్ని వస్త్రాలను అందమైన ప్యాక్ లో ఉంచి వాటిని కానుకగా సైనా నెహ్వాల్‌కు పంపారు. ఈ విషయాన్ని సైనా తన ట్విట్టర్‌లో అన్నారు. ‘అనుష్క శర్మకు ధన్యవాదాలు. ఈ దుస్తులను త్వరలోనే ధరిస్తా. ‘నుష్’ సంస్థ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మీకు శుభాకాంక్షలు ’ అని సైనా తన ట్వీట్ లో తెలిపారు.

Comments

comments