Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

నీటి తరలించే ఏ చర్యలనైనా అడ్డుకుంటాం

cong2

మనతెలంగాణ/ నిజామాబాద్ బ్యూరో
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న భూములకు నీరందించకుండవా పోచంపాడు వరద కాల్వ ద్వారా మానేర్‌డ్యాంకు నీటి తరలించే కుట్ర కు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ ఆరోపించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాయంలో ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ జిల్లా రైతాంగం కడుపు కొట్టి, నీటిని తరలించే ఏలాంటి చర్యలనైనా అడ్డుకుంటామని తాహెర్ హెచ్చరించారు. తొలుత నిజా ంసాగర్ ప్రాజెక్టులోకి ఇసుక రాకుండా అడ్డుకోవడానికి సింగూరు ప్రాజెక్టును నిర్మించారని కాలక్రమేణా జంటనగరాల తాగునీటి అవసరాలకు వాడుకోవడం ప్రారంభించి నిజాంసాగర్ ప్రాజెక్టు వట్టిపోయేలా చేసి జిల్లా రైతాంగము కడుపులు కొట్టారని తాహెర్ విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 65 టి.ఎం.సిలు ఉంటేనే నీటిని విడుదల చేయాలని ఆదేశాలున్నా, 55 టి.ఎం.సిల నీటి నిలువ ఉన్నా, అక్కడి నుండి కరీంనగర్ జిల్లా త్రాగునీటి అవసరాల పేరిట నీటిని తరలించుకుపోయారని, ఇప్పుడు మళ్ళీ సింగూరు జలాలను నిజాంసాగర్‌కు వదిలినట్టే వదిలి, శ్రీరాంసాగర్ ద్వారా మళ్ళీ నీటిని తరలించుకుపోయే కుట్రు పన్నారని తాహెర్ విమర్శించారు. గత కాం గ్రెస్ ప్రభుత్వాలు ఒక్క ఎకరం ఎండిపోకుండా పంటలను కాపాడింద ని, ప్రతిక్షణం కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారా మంత్రి హరీష్‌రావు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని, వాటర్ మేనేజ్‌మెంటగ్ పేరిట, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తే చూస్తు ఊర్కో బోమని తాహెర్ హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రకళ, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెంకులు, ప్రధాన కార్య దర్శి బంటు బలరాం, చంద్రశేఖర్‌గౌడ్ తదితరులున్నారు.

Comments

comments