Search
Wednesday 22 November 2017
  • :
  • :
Latest News

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

CM-NCB

విజయవాడ : కృష్ణా నదిలో ఫెర్రీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన పడవ ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పడవ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని బాబు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ప్రమాదానికి పడవ నిర్వాహకుల బాధ్యతా రాహిత్యమే కారణమని ఆయన పేర్కొన్నారు.

AP CM Chandra babu Comments on Boat accident

Comments

comments