Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రైతుల తలరాతలు కాలరాస్తారా?

cong

*పచ్చని మెతుకు సీమను ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం
*జిఓ, సర్కులేషన్, మెమో లేకుండా అక్రమంగా నీరు వదలడానికి మీరెవరు?
*కలెక్టరేట్ ముట్టడికి యత్నం – రైతుల భారీ ర్యాలీ, ధర్నా, రాస్తారోకో, అరెస్ట్
*డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి వాకిటి సునితాలకా్ష్మరెడ్డి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వ హయంలో సింగూరు జలాలను దోపిడీ చేస్తూ పచ్చటి మెతకుసీమను ఎడారిగా మారుస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతా లకా్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం సింగూరు జలదోపిడీ నిలిపివేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు స్థానిక ఎస్పీ కార్యాలయం ముందే బారికేడ్ల్లు అడ్డంగా ఉంచి ఆపడానికి ప్రయత్నించడంతో వాటిని కూడా లెక్కచేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ముం దుకు దూసుకెళ్లారు. అక్కడి నుండి మాజీ మంత్రి సునితారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు, కార్యకర్తలు, ప్రజానాయకులు, రైతు సంఘాల నాయకులు స్థానిక రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ ధర్నాతో ఇరువైపులా రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి వాకిటి సునితరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం వస్తే మోకాళ్లు అడ్డుపెడితే నీళ్లు వస్తాయన్న మాటలు కేవలం హామీలకే పరిమితమయ్యాయన్నారు. సింగూరుకు దిగువ ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు అక్రమ జలదోపిడీ వల్ల రాబోవు రోజుల్లో గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వం కేవలం ప్రగల్భాలకే పరిమితమైందని, జిల్లాలో కనీసం ఒక్క ఎకరానికి సరిపడ సాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొందన్నారు. జిల్లాలోని నీరు తరలిపోతుంటే ఇరిగేషన్ శాఖా మంత్రితో సహా ముఖ్యమంత్రి కూడా జిల్లా వారయ్యుండి కూడా ఏమి చేయ్యలేక చోద్యం చూస్తున్నారన్నారు. వీరితో పాటు జిల్లాలో ఉన్న టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసమర్థ్ధుల్లా వ్యవహరిస్తునారన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్
ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్‌కు తరలించే తాగునీటిని సైతం జిల్లాలోని రైతులకు ఉపయోగిస్తామని చెప్పిన మాట ఎటుపోయిందని ప్రశ్నించారు. నిండుకున్న సింగూరు జలాల నుండి 15 టిఎంసిల నీటిని తరలిస్తే తప్పేంటని ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రాద్ధ్దాంతం చేస్తున్నాయన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ… సింగూరులో మీరేమైనా నీటిని నింపారా అని ఆమె ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా అడుగంటిపోయిన సింగూరుకు కర్నాటక ప్రభుత్వం చుక్కనీరు రాకుండా చెక్‌డ్యాంలు కట్టుకున్నప్పటికీ దేవుడి దయతో వర్షాలతో నిండిన సింగూరు నీటిని రైతుల కళ్లల్లో కారం కొట్టి ఎస్‌ఆర్‌ఎస్పీకి తరలిస్తున్నారన్నారు. జివో ప్రకారం సింగూరు నుండి ఘనపూర్ ఆయకట్ట రైతులకు 4 టిఎంసిల నీటిని అందించాల్సి ఉంది, అయితే అవి కూడా ప్రజలు కాళ్లవేళ్ల పడి విడతల వారీగా విడిపించుకోవడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. జీవో, సర్కులర్, మెమో లేకుండా కేవలం ఒక మాటపై అక్రమ మాటపై జలదోపిడీని జరుపడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఎటువంటి హక్కులేని కరీంనగర్ జిల్లాకు 15 టిఎంసిల నీటిని తరలిస్తే ఉన్న 14 టిఎంసిలలో ఎడున్నర టిఎంసిలు డ్యాంలోనే సీల్డ్ కింద ఉంటాయని, మిగతా 5 టిఎంసిలు ఘనపూర్‌కు అందిస్తే మిగిలిన రెండు టిఎంసిలతో సింగూరు దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి సరిపోతాయని అని ప్రశ్నించారు. అడ్డగోలుగా వేలకోట్లతో వేసిన పైపుల ద్వారా మంచినీటిని ఏ విధంగా అందిస్తారని ప్రశ్నించారు. సింగూరు జలదోపిడీతో మిషన్‌భగీరథ పైపులు ఎండిపోతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి, కంఠంరెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, చంద్రపాల్, మేడి మధుసూదన్‌రావు, కొండన్ సురేందర్‌గౌడ్, కేవల్ జగదీశ్, నిర్మలజగ్గారెడ్డి, రెడ్డిపల్లి అంజనేయులుగౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, పవన్‌శ్రీకార్‌రావు, మామిండ్ల అంజనేయులు, అంజనేయులుగౌడ్, మల్లేశంగౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Comments

comments