Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

ఆకాశంలో సగాన్ని వెలిగించే నెలవంక

evaka

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ముద్దుల కూతురైన ఇవాంకా ఆయనకు సలహాదారు కూడా. అయితే ఆమె అనేక అంశాల్లో తండ్రితో విభేదిస్తారు కూడా. ‘అమెరికా ఫస్ట్’ అనే జాతీయ తావాదంతో కూడిన విదేశీ విధానం తండ్రిదైతే కూతురు ఇవాంకా మాత్రం ఆర్థిక సమాజాన్ని మరో కోణం నుంచి వీక్షించారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించా ల ంటే వారికి ఆర్థిక రంగంలో ప్రత్యేక సౌకర్యాలు ఉండాలని, పారిశ్రామి కవేత్తలుగా ఎదిగే అవకాశాలు ఉండాలని భావించారు. జి- 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తండ్రి సమక్షంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సాయం చేయడం ప్రస్తుత అవసరం అని, కనీసం ఒక బిలియన్ డాలర్ల మేరకు నిధిని సేకరించాలనుకున్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు ఈ వ్యాఖ్యలకు పెద్దగా స్పందన రాలేదు. ఆమె తన ఆలోచనకు అనుగుణంగా ప్రపంచబ్యాంకు తలపెట్టిన ‘ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఫైనాన్స్ ఇనిషియేటివ్’ (ఉయ్ ఫై) అనే వ్యవస్థకు ఇతోధిక ప్రోత్సాహాన్ని అందిస్తు న్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొద్దిమంది మహిళా పారిశ్రామి కవేత్తలతో భేటీ అయిన తర్వాత లభించిన సాను కూల స్పందనతో ‘ఉయ్ ఫై’ ఊపు అందుకున్నది. ఆ తర్వాత పన్నెండు దేశాలు ఈ ఆలోచనకు సై అన్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే దాదాపు 325 మిలియన్ డాలర్ల మేర నిధి సమకూరింది. పారిశ్రామికవేత్తలుగా రాణించాల నుకునే మహిళలకు ఈ నిధి ద్వారా రుణసదుపాయం కల్పించడం ఈ నూతన ఆలోచన ఉద్దేశం. ఇవాంకా ఆలోచనకు మద్దతు పెరుగుతుండడంతో అనేక బీమా కంపెనీలు, వెంచర్ కాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ సంస్థలు సహకారాన్ని వ్యక్తం చేశాయి. మహిళల భాగస్వామ్యంతో కూడిన సంస్థలను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయా ఉత్పత్తులకు అనుగుణంగా ఆర్థిక సాయం అందించడంపై సంసిద్ధత వ్యక్తం చేశాయి. అనేక దేశాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు ఇవాంకా స్ఫూర్తిగా నిలిచారు. అనేక దేశాలకు రుణాలిచ్చే ప్రపంచ బ్యాంకు సైతం ఇప్పుడు ఉయ్ ఫై ఆలోచనపై దృష్టి సారించింది. మహిళలు ప్రారంభించే స్టార్టప్‌లకు లేదా ఇప్పటికే నడుస్తున్న వారి సంస్థలకు ఈక్విటీ పెట్టుబడులు ఇచ్చి తగినంత ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. పలు బీమా సంస్థలు కూడా మహిళ కేంద్రంగా నూతన పాలసీలను రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి. ఒక మహిళా పారిశ్రామికవేత్తగా భవిష్యత్తులో మరింతమంది మహిళలను ఆ దిశగా ఎదిగించాలన్న ఉద్దేశంతో ఇవాంక చేసిన ఆలోచనకు ఇప్పుడు స్పష్టమైన విధానం ఏర్పడింది. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్‌లో 52% మహిళా ప్రతినిధులు ఉండడం గమనార్హం. ఆమెతో పాటు వస్తున్న అమెరికా ప్రతినిధి బృందంలో సైతం మహిళలు గణనీయంగా ఉన్నారు. పురుషులకు దీటుగా మహిళలు వాణిజ్య రంగంలో రాణించినట్లయితే ప్రపంచ మార్కెట్‌లో పన్నెండు ట్రిలియన్ డాలర్లు అదనంగా చేరుతాయని ఒక సంస్థ ప్రతినిధి ఇటీవల వ్యాఖ్యానించారు.

Comments

comments