Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

కనురెప్ప డ్యూటీ లేదు బతుక్కి గ్యారంటీ

life

ప్రతి నెలా వీరికి సగటున ఇస్తున్న జీతం మాత్రం ఏడున్నర వేల రూపాయలే. ఇఎస్‌ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఏజెన్సీలు చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం అవి గార్డులకు అందడం లేదు. మెడికల్ లీవ్, పెయిడ్ లీవ్, జీవిత బీమా లాంటి సౌకర్యాలు ఉండవు. ఉద్యోగ భద్రత గురించి చెప్పాల్సిన పనే లేదు. చాలా సెక్యూరిటీ సంస్థలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి తప్ప కాంట్రాక్టు లేబర్ యాక్ట్ నిబంధనలను పాటించడం లేదని ఎన్‌ఎస్‌డిసి అభిప్రాయపడింది. యూరోపియన్ యూనియన్‌లో ఒక్కో గార్డుకు ప్రతి నెలా 1200 డాలర్లు, యుఇఎలో 545 డాలర్లు చెల్లిస్తుండగా, మన దేశంలో మాత్రం అది కేవలం 125 డాలర్లు (ఏడున్నరవేల రూపాయలు)గా ఉంది. తగిన సౌకర్యాలను కల్పించి, వేతనాలను కేంద్రం నిర్దిష్టంగా నిర్ణయించి, ఏజెన్సీల రిజిస్ట్రేషన్‌లపై పకడ్బందీ విధానాన్ని అవలంబించినట్లయితే అవసరాలకు అనుగుణంగా ఈ రంగంలోకి యువతను ఆకర్షించవచ్చునని ఎన్‌ఎస్‌డిసి అభిప్రాయపడింది. 

కూలీపని చేసుకునైనా బతుకుతానుగానీ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మాత్రం చేయను… అని చాలా మంది నిరాసక్తత చూపుతూ ఉంటారు. ఈ వృత్తిని నామోషీగా భావిస్తుంటారు. గత్యంతరంలేక సెక్యూరిటీ గార్డుగా చేరినా పరిచయటస్థులెవరైనా చూస్తారేమోననే బెరుకుతో ఉంటారు. అందుకే మన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డుల్లో చాలా మంది ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు లేదా స్థానికేతరులు కనిపిస్తారు. ఒకప్పుడు పెద్దపెద్ద, వాణిజ్య సముదాయాల్లో, పరిశ్రమల దగ్గరా కనిపించే సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు నగరాల్లోని దాదాపు అన్ని అపార్టుమెంట్లలో సంపన్నుల బంగళాల్లోనూ కనిపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డును పెట్టుకోవడం ఒక హోదా చిహ్నం గా మారింది. తగినంతగా సెక్యూరిటీ గార్డులు మాత్రం అందుబాటులో లేరు. గత రెండు దశాబ్దాలలో పోలిస్తే ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవస్థలో మార్పు వచ్చింది. సుమా రు రూ. 40 వేల కోట్ల కిమ్మత్తు గల ఈ రంగ ం 85 లక్షల పైగా మందికి ఉపాధి కల్పిస్తోం ది. దేశమంతటా జిల్లాల్లోనూ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవస్థ కనిపిస్తున్నప్పటికీ మె ట్రో, ప్రధాన నగరాల్లోనే వీరు ఎక్కువగా ఉన్నారు.
నూతన ఆర్థిక సంస్కరణల ప్రవేశంతో పరిశ్రమల స్థాపన, పట్టణీకరణ గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకొంది. షాపింగ్ మాల్స్ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. టౌన్‌షిప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటికి తగినట్లుగా భద్రతా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు 222 మంది పోలీసులు ఉండాలి. మన దేశంలో 137 మందే మాత్రమే ఉన్నారు. దీంతో అనివార్యంగా ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థపై ఆధారపడవలసి వస్తోంది. పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, మెట్రో స్టేషన్లు, హైదరాబాద్‌లో లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆదాయపు పన్ను, జిఎస్‌టి కార్యాలయాలు ఇలా అనేక చోట్ల ప్రైవేటు గార్డుల సేవలు అవసరమవుతున్నాయి. గణేశ్ నిమజ్జనం సమయంలోనూ, తాజాగా ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లోనూ ప్రైవేటు గార్డులను ప్రభుత్వం వినియోగిస్తోంది. పదేండ్ల క్రితం ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర హోం మంత్రిత్వశాఖ గుర్తించింది. ఉగ్రవాదుల దాడిని మొదటగా పసిగట్టి నిలువరించింది సెక్యూరిటీ గార్డులే. నిజంగా ఆ సమయానికి గార్డుల చేతిలో ఆయుధాలే ఉన్నట్లయితే, వారికి తగిన శిక్షణ కల్పించి ఉన్నట్లయితే ఇంత ప్రాణ నష్టం జరగకుండా ఉండేదని అప్పట్లో రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. భద్రతా విధుల్లో పోలీసు వ్యవస్థకు దాదాపు సమానమైన పాత్రను ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు పోషిస్తున్నారు. గార్డుల వినియోగం ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఉన్నప్పటికీ ఈ వృత్తిలోకి వస్తోంది మాత్రం గ్రామీణ ప్రాంతం నుంచే. ఎక్కువగా యువత. మహిళలు చాలా స్వల్పం. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్ నుంచి గార్డులుగా హెచ్చు సంఖ్యలో రిక్రూట్ అవుతున్నారు. తెలంగాణలో సుమారు నాలుగున్నర లక్షల మంది గార్డులు పనిచేస్తున్నారు. ఇందులో రెండున్నర లక్షలకు పైగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇరవై వేల ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నా రిజిస్టర్ అయినవి కేవలం నాలుగున్నర వేలే. మిగిలినవన్నీ అనధికారికమే. అత్యధికంగా తమిళనాట సుమారు 700 ఏజెన్సీలు ఉన్నాయి. తెలంగాణలో 600 ఉన్నా లైసెన్సులు కలిగినవి 200కు మించి లేవు.
ప్రైవేటు గార్డుల్లో ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనని జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి) ఒక నివేదికలో పేర్కొనింది. ప్రతి ఏటా పది లక్షల మంది కొత్తగా వచ్చి చేరుతుండగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం కారణంగా ఈ వృత్తి విడిచిపెట్టి తిరిగి గ్రామీ ణ ప్రాంతాలకు వెళ్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఉపాధికల్పనలో ఈ రంగం కీలకమైనదిగా మా రింది. దేశం మొత్తంమీద 32 లక్షల మంది పోలీసులు ఉంటే ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు అందుకు రెట్టింపు సంఖ్య లో ఉన్నారు.
మొత్తం గార్డుల్లో దాదాపు 40% షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్ళు, మెట్రో స్టేషన్లు, కార్పొరేట్ సంస్థల్లో, 38% పరిశ్రమల్లో, 19% అపార్టుమెంట్లలో పనిచేస్తున్నట్లు ఎన్‌ఎస్‌డిసి తన నివేదికలో పేర్కొనింది. పరిశ్రమల్లో ఎక్కువగా తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో డిమాండ్ ఉందని, అపార్టుమెంట్ల అవసరాల్లో దాదాపు 70% మెట్రో నగరాల్లోనేనని పేర్కొనింది. అల్పాదాయ వర్గాల నుంచి ఎక్కువగా ఈ వృత్తిలోకి వస్తున్నవారిలో అక్షరాస్యత సైతం అంతంతమాత్రమే. ప్రత్యామ్నాయం లేక ఈ వృత్తిలోకి వస్తున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి నెలా వీరికి సగటున ఇస్తున్న జీతం మాత్రం ఏడున్నర వేల రూపాయలే. ఇఎస్‌ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఏజెన్సీలు చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం అవి గార్డులకు అందడం లేదు. మెడికల్ లీవ్, పెయిడ్ లీవ్, జీవిత బీమా లాంటి సౌకర్యాలు ఉండవు. ఉద్యోగ భద్రత గురించి చెప్పాల్సిన పనే లేదు. చాలా సెక్యూరిటీ సంస్థలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి తప్ప కాంట్రాక్టు లేబర్ యాక్ట్ నిబంధనలను పాటించడం లేదని ఎన్‌ఎస్‌డిసి అభిప్రాయపడింది. యూరోపియన్ యూనియన్‌లో ఒక్కో గార్డుకు ప్రతి నెలా 1200 డాలర్లు, యుఇఎలో 545 డాలర్లు చెల్లిస్తుండగా, మన దేశంలో మాత్రం అది కేవలం 125 డాలర్లు (ఏడున్నరవేల రూపాయలు)గా ఉంది. తగిన సౌకర్యాలను కల్పించి, వేతనాలను కేంద్రం నిర్దిష్టంగా నిర్ణయించి, ఏజెన్సీల రిజిస్ట్రేషన్‌లపై పకడ్బందీ విధానాన్ని అవలంబించినట్లయితే అవసరాలకు అనుగుణంగా ఈ రంగంలోకి యువతను ఆకర్షించవచ్చునని ఎన్‌ఎస్‌డిసి అభిప్రాయపడింది. ఎక్స్‌రే స్కానింగ్ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు, వాహనాల తనిఖీ పరికరాలు, రిజిస్టర్‌ల నిర్వహణలో ప్రావీణ్యం ఉన్న గార్డులు స్టార్ హోటళ్ళు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటారు. వీరి వేతనం గరిష్టంగా ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది. ప్రావీణ్యత లేనివారు పరిశ్రమలు, అపార్టుమెంట్లు, బంగళాలలో పనిచేస్తూ ఉంటారు.
ఎటిఎంలలో డబ్బును జమ చేయడానికి వివిధ బ్యాంకులు ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. దేశం మొత్తంమీద కేవలం ఏడు ఏజెన్సీలుఈ రంగంలో ఉన్నాయి. రోజుకు సగటున 80 వేల ఎటిఎంలలో కనీసంగా రూ. 15 వేల కోట్లను జమ చేస్తున్నాయి. ఇందుకోసం ఏడువేలకు పైగా వాహనాలను వినియోగిస్తున్నాయి. ఈ పనుల్లో సుమారు నలభై వేల మంది ఉన్నట్లు తేలింది. అయితే ఏజెన్సీలకు ఆయుధాలను వినియోగించే లైసెన్సు లేనప్పటికీ ఎక్కువ మంది గార్డులు మాజీ సైనికోద్యోగులు కాబట్టి వారికి స్వంతంగా ఉన్న లైసెన్సుల మేరకు బ్యారెల్ గన్‌లను వినియోగిస్తున్నారు. డబ్బులతో ముడిపడిన ఈ వ్యవహారానికి పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఎన్‌ఎస్‌డిసి ఆయుధాల వినియోగంపై శిక్షణ, లైసెన్సు మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసింది. అది పరిశీలన దశలోనే ఉంది. అపార్టుమెంట్లలో గార్డులుగా పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది నడివయసువారు, వృద్ధులు. వీరిలో హెచ్చుశాతం ఉపాధి నిమిత్తం వలసవచ్చినవారే. పిల్లల ఆదరణ, ఆదాయ వనరులు లేకపోవడం, వ్యవసాయంలో నష్టపోవడం తదితర కారణాలతో గార్డులుగా చేరుతున్నారు. నాలుగైదు వేల రూపాయల జీతానికే అపార్టుమెంటులు, ఎటిఎంలు, వాహనాల పార్కింగ్ దగ్గర గార్డులుగా పనిచేస్తున్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ రంగంపై సమాజంలో చిన్నచూపు ఉంది. గార్డు ఉద్యోగానికి బదులు మరో వృత్తిని ఎంచుకోవడం మేలని భావిస్తుంటారు. అపార్టుమెంట్లలో గార్డు, వాచ్‌మన్ ఉద్యోగాల పట్ల ది మరింత ఎక్కువ. షాపింగ్ మాల్స్‌లో పనిచేసే స్థానిక గార్డులు ఎవరైనా పరిచయస్థులు కనిపిస్తే నామోషీగా భావించి దాక్కునే దృశ్యాలు కూడా కనిపిస్తాయి. గార్డును నియమించుకోవడం హోదాగా భావించేదగ్గరే ఈ వృత్తి చేసేవారు ఆత్మన్యూనతకు గురికావడం ఒక విచిత్రమైన వైరుధ్యం. అందుకే గార్డుల్లో స్థానికేతరులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. లేదా రాత్రివేళల్లో పనికి సిద్ధపడుతుంటారు.
ఇటీవలి కాలంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అవసరం పెరిగిందని తెలంగాణ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సంఘం అధ్యక్షుడు సి. భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. అనేక కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, అపార్టుమెంట్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. గార్డుల్ని పెట్టుకోవడం ఒక హోదాగా మారిపోయిందని అన్నారు. తక్కువ మొత్తానికి కాంట్రాక్టు అడుగుతుండడంతో లైసెన్సు లేని ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇఎస్‌ఐ, పిఎఫ్‌లతో పాటు జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది, వాటిని తప్పించుకోవడం కోసం లైసెన్సులేని ఏజెన్సీలు వెలుస్తున్నాయని అన్నారు. నేరాల నియంత్రణ, నివారణలో సెక్యూరిటీ గార్డులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, దురదృష్టవశాత్తు కొన్ని అపార్టుమెంట్లలో ఇండ్ల అవసరాలకు వినియోగిస్తుండడంతో భద్రత గాల్లో దీపమైందని, ఈ వృత్తిపట్ల చిన్నచూపు కూడా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఇంతకన్నా తక్కువ వేతనం వస్తున్న హోంగార్డులుగా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారుగానీ సెక్యూరిటీ గార్డులుగా రావడానికి ఆసక్తి చూపడంలేదని అన్నారు. హోం మంత్రిత్వశాఖ, కార్మిక మంత్రిత్వశాఖలు పగడ్బందీగా వ్యవహరించి నకిలీ ఏజెన్సీలను ఏరివేయాలని, గార్డులందరికీ ఒకే తరహా యూనిఫారంను ఖరారు చేయాలని, నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రతి గార్డుకు గుర్తింపు కలిగిన అకాడమీ ద్వారా సర్టిఫికేట్, ట్రెయినింగ్, ఐడి కార్డులు ఇచ్చినట్లయితే నకిలీ ఏజెన్సీల బెడదను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

నేరాల నియంత్రణ, నివారణలో సెక్యూరిటీ గార్డులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, దురదృష్టవశాత్తు కొన్ని అపార్టుమెంట్లలో ఇండ్ల అవసరాలకు వినియోగిస్తుండడంతో భద్రత గాల్లో దీపమైందని, ఈ వృత్తిపట్ల చిన్నచూపు కూడా ఏర్పడిందని తెలంగాణ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సంఘం అధ్యక్షుడు సి. భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. అభిప్రాయపడ్డారు. ఇంతకన్నా తక్కువ వేతనం వస్తున్న హోంగార్డులుగా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారుగానీ సెక్యూరిటీ గార్డులుగా రావడానికి ఆసక్తి చూపడంలేదని అన్నారు. హోం మంత్రిత్వశాఖ, కార్మిక మంత్రిత్వశాఖలు పగడ్బందీగా వ్యవహరించి నకిలీ ఏజెన్సీలను ఏరివేయాలని, గార్డులందరికీ ఒకే తరహా యూనిఫారంను ఖరారు చేయాలని, నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రతి గార్డుకు గుర్తింపు కలిగిన అకాడమీ ద్వారా సర్టిఫికేట్, ట్రెయినింగ్, ఐడి కార్డులు ఇచ్చినట్లయితే నకిలీ ఏజెన్సీల బెడదను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

పదేండ్ల క్రితం ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర హోం మంత్రిత్వశాఖ గుర్తించింది. ఉగ్రవాదుల దాడిని మొదటగా పసిగట్టి నిలువరించింది సెక్యూరిటీ గార్డులే. నిజంగా ఆ సమయానికి గార్డుల చేతిలో ఆయుధాలే ఉన్నట్లయితే, వారికి తగిన శిక్షణ కల్పించి ఉన్నట్లయితే ఇంత ప్రాణ నష్టం జరగకుండా ఉండేదని అప్పట్లో రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. భద్రతా విధుల్లో పోలీసు వ్యవస్థకు దాదాపు సమానమైన పాత్రను ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు పోషిస్తున్నారు.

Comments

comments