Search
Wednesday 22 November 2017
  • :
  • :

మహిళా హోంగార్డుతో ఎఎస్‌ఐ మసాజ్

plshకార్యాలయంలోనే రిజర్వ్ పోలీసు అధికారి నిర్వాకం 

 గద్వాల : పోలీసు కార్యాలయా న్నే మసాజ్ సెంటర్‌గా ఏర్పాటు చేసుకుని ఎఆర్ శాఖలోని ఎఎస్‌ఐ మహిళా హోంగార్డుతో సేవలు చేయించుకుంటున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కేం ద్రంలోని సాయుధ బలగాల కార్యాలయంలో ఎ ఎస్‌ఐగా పనిచేస్తున్న హసన్ అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా హోంగార్డు చేత మసాజ్ చేయించుకుంటున్నాడు. ఎవరైనా అడ్డుచెప్పటానికి ప్ర యత్నిస్తే వారిపై కస్సుమంటున్నాడని కొందరు కానిస్టేబుళ్లు తెలిపారు. దీంతో ఎవరికీ చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై జిల్లా ఎస్‌పి ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా తనకు అటువంటి ఫిర్యాదు ఏదీ అందలేదన్నారు. అయితే ఈ విషయంపై ఉన్నత అధికారులు దృష్టి సారించి వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు చెందిన కొందరు పోలీసు అధికారులు డిమాండ్ చేయడం గమనార్హం .

Comments

comments