Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

విద్యార్ధిని కొట్టిన అటెండర్

child
దంతాలు ఊడి విద్యార్ధికి గాయాలు

కీసర : విద్యార్థుల బాగోగులు చూసుకోవాల్సిన పాఠశాల అటెండర్ అతి కిరాతకంగా ప్రవరించాడు. ఫలితంగా విద్యార్థి దంతాలు ఊడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాంపల్లిలోని డెక్కన్స్ ప్రైడ్ పాఠశాలలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థ్ధి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామానికి చెందిన ఎస్.గణేష్ కుమారుడు అఖిల్‌రాజ (13) డెక్కన్స్ ప్రైడ్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాల ఆవరణలో తోటి విద్యార్ధులు ఖోఖో ఆడుతుండగా అఖిల్‌రాజ నీరసంగా ఉంద ని తాను ఆడలేనంటూ అటెండర్ మహేష్‌కు తెలిపాడు. దీంతో విచక్షణ కోల్పోయిన మహేష్ విద్యార్ధి ముఖంపై బాదడంతో దంతాలు ఊడిపోయాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. స్థానికులతో కలిసి పాఠశాల అటెండర్ నిర్వాకంపై యాజమాన్యాన్ని నిలదీశారు. అటెండర్ మహేష్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల నిర్వాహకులు తెలిపి అతనితో వారికి క్షమాపణలు చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ అస్థాసంక్రిత్యన్ మాట్లాడుతూ, విద్యార్ధిని విచక్షణా రహితంగా కొట్టిన అటెండర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.

Comments

comments