Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ఆరుతడి పంటలపై అవగాహన

meetingమనతెలంగాణ/నిజామాబాద్ అర్బన్: నిజాంసాగర్ ప్రాజెక్టు కింద గల చివరి ఆయకట్టు రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలు వేసే విధంగా పూర్తి అవగాహన కల్పించాలని ఇంచార్జీ జిల్లా కలెక్టర్ ఎ. రవీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు కింద రైతులు మార్చి 31లోగా పంట చేతికొచ్చే విధంగా ప్రభుత్వ నిర్వహించినందున అందుకోసం 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు విడుదల చేసిన నీటి నారుమళ్లు చివరి ఆయకట్టు రైతుల ఆరుతడి పంటలు వేసుకునే వీలుగా నీటిని విడుదల చేశామని, రైతులు డిమాండ్‌ను బట్టి మరిన్ని క్యూసెక్కు ల నీటిని విడుదల చేసేందుకు జిల్లా యంత్రంగా సిద్ద్ధంగా ఉందన్నారు. ఏప్రిల్ మాసంలో ప్రకృతి వైపరీత్యాలకు పండించిన పంట నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో తొందరగా నీటి విడుదల చేయడం జరిగిందని, డిసెంబర్ 31వరకు మొత్తం ఆయకట్టు వరినాట్లు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించేందుకు మండలంలో మరొకటి బృం దం ఏర్పాటు చేయని వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు ప్రతి గ్రామంలో రైతు సమన్వయ సమితుల సహకారంతో పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించా రు. గత రబీలో వాయిదా పద్దతిలో నీటి సరఫరా చేసినందున మంచి దిగుబడి వచ్చిందన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు గోడపత్రికలు, కరపత్రా లు, స్థానిక వార్త పత్రికల ద్వారా ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో తప్పకుండా అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి విడుదల వల్ల ఏఏ ప్రాంతంలో ఇబ్బంది ఉందో వరి పంట వేస్తే భవిష్యతులో ఏ సమస్యలు వస్తాయో, ముం దుగా గుర్తించే ఆ ప్రాంతంలో ఆరుతడి పంటలను ప్రోత్సాహించాలన్నారు. పంట వేసిన తర్వాత నీరు లేక ఎండిపోతే ఎవరికైనా బాధ గా ఉంటుందనే ఆ దుస్థితి రాకుండా ముందస్తుగానే రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గత రబీలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి రైతులు ఇబ్బందులు పడకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో రైతులకు 1570 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసినందున కొందరు బ్యాంకర్లు యుసి లు ఇవ్వలేదని యుసిలు ఇవ్వని బ్యాంకర్ల నుండి తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ గంగాధర్, జిల్లా వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments