Search
Monday 11 December 2017
  • :
  • :

అయ్యప్ప దీక్ష- ఆరోగ్యం

Ayyapa-images

శబరిగిరుల్లో ఉన్న హరిహరసుతుడైన అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాల ధరిస్తారు. నియమ నిష్ఠలతో 41 రోజులు దీక్ష చేస్తారు. అయ్యప్ప దీక్ష చాలా కఠినమైంది. భక్తిభావంతో కూడుకుంది. చన్నీటి స్నానం, నేలపై పడుకోవడం, ఒకపూట భోజనం, పాదరక్షలు ధరించకపోవడంలాంటి నియమాలను పాటిస్తారు. ఈ నిమయాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

దీర్ఘకాలం నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి రాకుండా ఉంటుంది. కండర పటిష్టతకు దోహదపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

 తెల్లవారుజామునే లేవడం చైతన్యానికి ప్రతీక. చన్నీటితో స్నానం శరీరంలోని నాడీవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అందువల్లే ముఖంలో ప్రసన్నత ఉంటుంది.
దీపారాధన వల్ల ఆవరణ అంతా కాంతిమంతం అవుతుంది. ఆ సమయంలో పూజ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
సామూహికంగా భోజనం చేయడం వల్ల ప్రేమభావం ఏర్పడుతుంది. అంతా సమానమనే భావం కలిగి ఉంటారు. ఇచ్చి పుచ్చుకునే తత్వం ఏర్పడుతుంది.

ఇతరులపై ఆధారపడకుండా రోజూ వారి వారి పనులను స్వయంగా చేసుకోవడంతో స్వీయ క్రమశిక్షణ కలుగుతుంది.
క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి అలవాటు పడతారు.
అధిక ప్రసంగాలకు, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృథా కాదు. ఆలోచనా సామర్థం మెరుగుపడుతుంది.

శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

పొగతాగడం, మద్యపానంలాంటి దురలవాట్లకు దూరంగా ఉండటం అలవాటు అవుతుంది.

 ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా సామాన్య జీవనం అలవడుతుంది.

Comments

comments