Search
Wednesday 22 November 2017
  • :
  • :

బాహు’బలి’…

Bahubali-Stunt

తిరువనంతపురం: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన అపురూప దృశ్యకావ్యం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో ప్రభాస్ టైటిల్ సాంగ్‌పై ఏనుగుతో చేసే స్టంట్ హైలెట్‌గా ఉంటుంది. ఏనుగుపై ఎక్కి అతిపెద్ద ధనస్సుతో బాణం గురిపెడుతుంటే ఆ దృశ్యం ఓ లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా… అక్కడికే వస్తున్నాం…

Elephant-Tosses-Man

ఈ రీల్ సీన్‌ను అచ్చం అలాగే రియల్‌లైఫ్‌లో అనుకరించబోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని కరిమన్నూర్‌లో జరిగింది. కాసేపు ఏనుగును బుజ్జగించిన ఆ యువకుడు తొండం ద్వారా పైకి ఎక్కడానికి యత్నించాడు. దాంతో ఏనుగు ఒక్కసారిగా యువకుడిని ఎత్తిపడేసింది. ఈ సంఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

comments