Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

జాగ్రత్త వహించండి?

tax

* అత్యాశ నుంచి భయం వైపు
*స్టాక్ మార్కెట్లలో నెమ్మదిగా మారుతున్న పరిస్థితులు
*హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు

ముంబయి : గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇండియన్ బ్యాంక్, టైటాన్ వంటి సంస్థల నుంచి మెరుగైన త్రైమాసిక ఫలి తాలు వెలువడ్డాయి. సెప్టెంబర్ ముగింపు నాటి క్యూ2 (జులైసెప్టెంబర్)లో లాభం 67 శాతం పెరగడంతో టైటాన్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఈ కంపెనీ షేర్లు 16 శాతం మేరకు లాభపడ్డాయి. మరోవైపు అమె రికా డ్రగ్స్ నియంత్రణ సంస్థ యుఎస్‌ఎఫ్‌డిఎ పంపిన హెచ్చరికలు లేఖతో లుపిన్ షేర్లు బొక్కబోర్లా పడ్డాయి. లుపిన్‌కు చెందిన రెండు ప్లాంట్లకు యుఎస్‌ఎఫ్‌డిఎ పంపిన నోటీసులతో ఆ కంపెనీ షేరు 20 శాతం పతన మైంది. అంతేకాదు లుపిన్ పతనం ప్రభావం ఇతర ఫా ర్మా రంగం షేర్లపైనా తీవ్రంగా కనిపించింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6 శాతం పడిపోయి. అటువైపు అరబిందో ఫార్మా రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 29 శాతం వృద్ధిని చూపినా.. మార్కెట్లో ఆ కంపెనీ విలువ 6.75 శాతానికి పడిపోయింది. మరోవైపు ఖతార్ ఫౌం డేషన్ ఎండోమెంట్ ఫండ్ తాజాగా భారతీ ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటాను విక్రయించింది. దాదాపు రూ.9,600 కోట్ల విలువ చేసే షేర్లను బ్లాక్ డీల్ ద్వారా సేల్ చేసింది. అయినప్పటికీ డిమాండ్ బాగానే ఉంది. అధిక వాల్యుయేషన్‌తో టెలికామ్ రంగంలో పెట్టుబడి పెట్టేం దుకు ఇన్వెస్టర్లు సుముఖత చూపుతున్నారు. క్రూడ్ ఆయి ల్ బ్యారెల్‌కు 57 డాలర్లు అయింది. సౌదీ అరెబీయాలో పవర్ కన్సాలిడేషన్, అంతర్గత కుటుంబ సమస్యలతో పశ్చిమ ఆసియాలో శాంతి వాతావరణానికి విఘాతం కలుగుతోంది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక్క సోమ వారం నాడే 3.5 శాతం ఎగసి 64 డాలర్లకు చేరింది. సౌదీ అరేబియా రాజు సల్మాన్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే చర్యల్లో భాగంగా మంత్రులు, యువ రాజులు, బిలియనీర్లపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించడం తో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తు తాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారమంగా చము రు ధరలు పెరిగితే ద్రవ్యలోటు, ద్రవ్యో ల్బణం కూడా పెరుగుతాయని అంచనాలున్నాయి. దీంతో ఆర్‌బిఐ కీలక రేట్లను తగ్గించకపోగా, ఏ క్షణమైనా పెంచే అవకాశాలు న్నాయన్న భయాలు నెలకొన్నాయి. అదే సమయంలో రూపాయి మారకం విలువ బలహీనపడింది.0.8 శాతం క్షీణతతో సెప్టెంబర్ 22నాటి కనిష్ఠ స్థాయికి చేరింది.
వరుస లాభాలకు బ్రేక్ :
కాగా ఐదు వారాలపాటు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లకు గతవారం బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు ఎక్కువగా లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వారాంతం శుక్రవారం నాటికి సెన్సెక్స్ 371 పాయింట్లతో 1.1 శాతం మేరకు నష్టపోయింది. ఆఖరికి 33,314 పాయిం ట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 131 పాయింట్లతో 1.25 శాతం క్షీణించి 10,322 పాయింట్ల వద్ద ముగి సింది. మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదయ్యాయి. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ సూచీ 1 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ కూడా 1.2 శాతం పతనమైంది. ఫార్మా దిగ్గజం లుపిన్ 20 శాతం కుప్పకూలగా, ఎయిర్ టెల్ 7.3 శాతం, ఆర్‌ఐఎల్ 6.6 శాతం, టాటా మోటార్స్, సిప్లా 5 శాతం నష్టపోయాయి.
కంపెనీల ఫలితాలు :
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు (జులై సెప్టెంబర్) ఇప్పటికే పలు కం పెనీలు ప్రకటిం చాయి. పెద్ద సంస్థల నుంచి ఫలితాలు మి శ్రమంగా ఉన్నాయి. కోల్ ఇండియా, ఎల్ అండ్ టి ఫలితాలు సోమవారం స్టాక్స్‌పై ప్రభావం చూపను న్నాయి. కనిపించే వీలున్నట్లు నిపు ణులు పేర్కొన్నారు. ఈ బాటలో అదానీ పోర్ట్, ఎన్‌టిపిసి 13న, ఐషర్ మోటార్స్, గెయిల్ ఇండియా, సన్ ఫార్మా ఈనెల 14న క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి.
ఈ నెల 14న డబ్లుపిఐ :
ప్రభుత్వం అక్టోబర్ నెలకు డబ్లుపిఐ(టోకు ధరల ఆధా రిత ద్రవ్యోల్బణం) గణాంకా లను మంగళవారం విడు దల చేయనున్నారు. సెప్టెంబర్‌లో డబ్లుపిఐ 2.6 శాతం పెరగ్గా.. ఆగస్ట్‌లోనూ 3.24 శాతం వృద్ధిని చూపింది.

Comments

comments