Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

సాక్షరభారత్‌పై నీలినీడలు

STUDY

మూసివేత దిశగా సాక్షరభారత్ కేంద్రాలు సమన్వయ కర్తల్లో
అయోమయం ఏడాదికాలంగా అందని వేతనాలు డిసెంబర్ నెలాఖరు

వరకు గడువు పెంపు ప్రశ్నార్థకంగా మారిన సాక్షరభారత్ అమలు తీరు

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఏర్పా టు చేసిన సాక్షరభాతర్ కార్యక్రమంపై నీలినీడలు  అలుముకుంటున్నాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్నరాష్ట్రాల్లో వయోజన విద్యాశాఖ ద్వారా సాక్షరభారత్ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను కేంద్ర ప్రవేశపెట్టింది.  గత ఏడేళ్లు ఆయా జిల్లాల్లో అమలవుతున్న సాక్షరభారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ కార్యక్రమంలో పని చేస్తున్న సమన్వయ కర్తలకు గత ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. అయితే ఈ పథకాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు  కొనసాగించేందుకు కేంద్రం గడువు  విధించగా పథకం  కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం పథకాన్ని కొనసాగించేందుకు రెండు సార్లు గడువు విధించింది. ఇప్పటి వరకు ఈ పథకంలో స్వచ్ఛంద కార్యకర్తలుగా తక్కువ వేతనాలతో ఏడు సంవత్సరాలుగా  అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు చేసే సర్వేలు, తదితర కార్యక్రమాల అమలులో ఎంసిఓలు, విసిఓలు సేవలను  అందించారు. ప్రస్తుతం సాక్షరభారత్ కార్యక్రమానికి కాలం చెళ్లుతుండడంతో వారి కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితులు  ఎదురయ్యాయి. అయితే కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేక కొత్త సంస్కరణలతో అమలు చేస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాలో 210 సాక్షరభారత్ కేంద్రాలు ఉండగా 420 మంది గ్రామ సమన్వయ కర్తలు , 14 మంది మండల సమన్వయ కర్తలు  పని చేస్తున్నారు.  సాక్షరభారత్ కార్యక్రమం లక్షాలు భాగానే ఉన్నప్పటికీ కేంద్రం ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా గత ఏడాది కాలంగా సిబ్బందికి వేతనాలు అందడం లేదు. నిధుల కేటాయింపు  లేకపోవడంతో కేంద్రాల నిర్వాహణను  పట్టించుకునే వారే కరువయ్యారు.  ఇప్పటికే పలు చోట్ల కేంద్రాలు మూత పడ్డాయి.  ఈపథకాన్ని నిలిపివేస్తే నిరక్షరాస్యుల పరిస్థితి  ఏమిటని ప్రశ్నార్థకంగా మారింది. మండలానికి ఒక సమన్వయ కర్త,పంచాయతీకి ఇద్దరి చొప్పున  సమన్వయ కార్యకర్తలను నియమించారు. మండల సమన్వయ కర్తలకు ప్రతి నెల రూ. 6 వేలు , గ్రామసమన్వయ కర్తకు రూ 2 వేల చొప్పున గతంలో  వేతనాలు చెల్లించారు. అయితే ఈపథకం నిర్వాహణకు కేంద్ర ప్రభుత్వం  నిధులను ఏర్పాటు చేయకపోవడం వలన సమన్వయకర్తలకు గత ఏడాది కాలంగా వేతనాలు ఇవ్వడం లేదు. ఎంతో సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ కార్యక్రమాన్ని కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments