Search
Wednesday 22 November 2017
  • :
  • :

కొడుకుకు కోటి కారు గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

saifjeepcar

ఆ చంటొడికి గట్టిగా తిప్పి చూస్తే సంవత్సరం వయస్సు ఉండదు. కానీ చిల్డ్రన్స్ డే స్పేషల్  గిఫ్ట్ గా ఏకంగా కోటి విలువ చేసే కారును గిఫ్ట్ గా అందుకున్నాడు. ఇచ్చింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. అతనేవరో కాదు బాలీవుడ్ స్టార్ సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్ తమ ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ కు ఈ గిఫ్ట్ ఇచ్చారు. చోటా నవాబ్‌సాప్‌కు ఆ మాత్రం గిఫ్ట్ లేకపోతే ఎలా అనుకున్నాడో ఏమో మరి. కాస్ట్‌లీ జీప్ ఎస్‌ఆర్టీ వెహికిల్‌ను సైఫ్ తన తనయుడికి ఇచ్చాడు. ఈ కారులో పిల్లలకోసం వెనకాల ఓసీటు కూడా ఉంది. ఇందులో తైమూర్‌ను కూర్చోబెట్టుకొని రైడ్‌కి వెళ్తామని సైఫ్ చెప్పాడు. ఈ కారుని కొన్న తర్వాత సైఫ్ మీడియాతో మాట్లాడాడు. చిల్డ్రన్స్ డేకు తైమూర్‌కు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అని అడిగితే? ఈ కారే ఇస్తున్నా అని సైఫ్ సమాధానం ఇచ్చాడు.  చిన్న పిల్లల విషయంలో భద్రత అనేది చాల అవసరం. ఈ కారులో చిన్నపిల్లలకోసం ప్రత్యేకంగా ఓ సీటు ఉంటుంది. అంతేగాక తన తనయుడు తైమూర్ ఈ కలర్ బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. కుమారుడి కోసం ఈ కారును అలాగే  ఉంచుతనని సైఫ్ మీడియాతో చెప్పాడు.

Comments

comments