Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

చర్చి నిర్మాణ పనులు అడ్డుకున్న స్థానికులు

chrch

ఘట్‌కేసర్ : అనుమతులు పొందకుండా చర్చిని నిర్మాణం చేస్తున్నారని స్థానికులు చర్చి నిర్మాణ పనులు ఆదివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, చర్చిపేతుతో ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా నిర్మాణ పనులు చేస్తున్నట్లు ఆరోపించారు. చర్చి నిర్మాణం ముసుగులో వ్యాపారం చేసేందుకు వ్యాపార సంస్థలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చర్చిలు ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పాడుతాయని  అన్నారు. చర్చిలు, దేవాలయాలు ప్రశాంత వాతావరణంలో నిర్మాంచాలని కోరారు. నిర్మాణాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవలని  కోరారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సామరస్యంగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

Comments

comments