Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

పేదలకో న్యాయం..నేతలకో న్యాయమా?

cong

పేదల గుడిసెలను కూల్చిన అధికారులు
నిరసనగా రెండు గంటల పాటు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం
కౌటాలలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఇదే స్థలంలో పక్కాభవనాలు నిర్మించిన ప్రజాప్రతినిధులు
భవనాల జోలికి వెళ్లని అధికారులు, పోలీసులు

ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పక్కా భవనాలు నిర్మించుకుంటే వాటిపైపు కన్నెత్తి కూడా చూడని పోలీసులు, రెవెన్యూ అధికారులు పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారు. కూల్చివేతలకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల సహకారంతో పేదలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించగా నాయకులు, పోలీస్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో ఇప్పటికే కొనసాగుతున్న 144 సెక్షన్‌ను ఈనెలాఖరు వరకు పొడిగించారు.  కొమురంభీం జిల్లాలోని కౌటారు మండల కేంద్రంలో గురువారం పేద ప్రజలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి రెండు గంటల పాటు ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులు నిర్మించుకున్న పక్క భవనాలను కూల్చివేయకుండా పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం ఎంత వరకు సమంజమని కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ , పో లీసు అధికారులపై మండిపడ్డారు. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో వారం రోజుల క్రితం పేదలు దాదాపు 12 షెడ్లను నిర్మించుకున్నారు. అయితే అప్పటి డిఎస్‌పి హబీబ్‌ఖాన్,తహసీల్దార్ యాకయ్యలు తెల్లవారుజామున వెళ్లి ట్రాక్టర్లతో షె డ్లను కూల్చివేసి, సామాగ్రిని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో పేదలకు, పోలీస్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం పోలీసులు మండల కేంద్రంలో 144 సెక్షన్‌ను విధించారు. కాగా గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పేదలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. పేదల గుడిసెలను కూల్చివేసిన అధికారులకు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్మించుకున్న భవనాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పిహెచ్‌సి స్థలంలో జడ్‌పిటిసి, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎంపిపిలు పక్కా భవనాలను నిర్మించుకున్నారు. అదే విధంగా మార్కెట్‌కు కేటాయించిన స్థలంలో మొన్నటి వరకు కొనసాగిన ఎంపిపి సైతం పక్కా భవనాలను నిర్మించుకున్నారు. మార్కెట్ భూముల్లో ఎ ంతో మంది టిఆర్‌ఎస్ నాయకులు పక్కా భవనాలను నిర్మించుకున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ స్థలాలను ఎక్కడిక్కడే ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తుండగా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు కేవలం పేదలు ఇండ్ల స్థలాలు లేక షె డ్లను నిర్మించుకుంటే కూల్చివేయడం వివాదాస్పదంగా మారి. ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.రెండు గంటల పాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోగా పేదలు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రావిశ్రీనివాస్,గోసుల శ్రీనివాస్‌యాదవ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడాం గణపతిలు మాట్లాడుతూ పేదలు నిర్మించుకున్న షె డ్లను కూల్చివేయడం అన్యాయం అన్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పక్కాభవనాలు నిర్మించుకుంటే పట్టించుకోని అధికారులు పేదలపై ప్రతాపాన్ని చూపించడం శో చనీయమన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రజాప్రతినిధుల భవనాలు సైతం కూల్చివేయాలని డిమాండ్ చేశారు. వారి భవనాలను కూల్చివేసే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.

Comments

comments