Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

123 విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా రద్దు:యూజిసి

ujcన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదాను రద్దు చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల పేరు చివర యూనివర్సిటీ పదం ఉంచరాదని ఆదేశించింది.కొత్త పేరుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. యూజిసి ప్రకటించిన 123 విద్యాసంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ, గంటూరుకు చెందిన కెఎల్ యూనివర్సిటీ, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, అనంతపురంలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరులోని విజ్ఞాన ఫౌండేషన్ ఫర్ సైన్స్(విట్).

ఇప్పటి వరకూ ఆయా యూనివర్సిటీలు జారీ చేసిన పట్టాలు, ధ్రువీకరణ పత్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేవలం పేరు మాత్రమే మార్చుకోవాలని యూజిసి తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో యూజిసి ఈ నిర్ణయం తీసుకుంది.

Cancel University status to 123 Educational Institutions

Comments

comments